పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరమించితిని. ఈవిషయము శ్రీమత్సన్నిధిని విన్నవించుటకు నాకు అవకాశములేనందున ఇచ్చోటం దెలుపుకొంటిని.]

(3) మన్ముద్రితగైర్వాణ ప్రియదర్శికానాటిక ముద్రణమార్గమున సంస్కృతనాటకములను పెక్కింటిని శాకుంతల మాలతీమాధవ మహావీరచరి త్రోత్తరరామచరిత్రాదులను మూల విరుద్ధార్థముగా నాంధ్రీకృతములైనట్టివానిని - వాస్తవార్థబోధకముగా వ్యాఖ్యాసమేతముగా... ప్రకటింపవలసి యున్నది.

(4)వ్యుత్పత్తులనొసంగునట్టి నిఘంటు వొకటి నిర్మింపవలసియున్నది.

(5) శ్రీమదాంధ్ర మహాభాగవతమును* సాధుపాఠనిర్ణయ పూర్వకముగాను గూడార్థబోధనపూర్వకముగాను ప్రకటింప వలసియున్నది.

(6) ఇంకను ఎల్లవారికిం బఠనీయముగా సకలనాటక కథావళి రచింపవలసియున్నది. ఇప్పుడున్న నాట కాంధ్రీకరణములలో కథయుంజెడియున్నది.

(7) శిశుపాలవధాది కావ్యములను సంస్కృతాంధ్ర వ్యాఖ్యా నాంధ్రటీకాసమేతముగా ముద్రింపవలయును.

(8) అమరకోశమునకు ఆంధ్రగైర్వాణమయమైన సుబోధ వ్యాఖ్య రచింపవలయును.

(9) కాశీఖండ సోమహరివంశ పాండురంగ మాహాత్మ్యాది దివ్యప్రబంధములను విషమపదటీకలతో సుముద్రిత


  • భారతముగానుండునా?