పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములనుం దొలంచుకొని, ఇదిమొదలుగా మూడుమాసములకు కాదంబర్యాంధ్రీకరణమునకు ధృతదీక్షుండనై అవిలంబితముగా దానిని ముగించి జగద్విశ్రాంతమయిన భవత్కీర్తిచంద్రికను సాంద్రతరీకరించెద.

(1) ఈభాషకు సమగ్రమైన వ్యాకరణములేదు.

(2) అట్టి యలంకారశాస్త్రమునులేదు. ఉన్నట్టి యలంకారగ్రంథములు ధనార్థులచే దొరలం బొగడుటకు సాధనములుగా వ్రాయబడినవేగాని విషయమునెల్ల విపులముగా సుబోధముగా చర్చించి విశదీకరించుటకు వ్రాయబడినవి కావు.

[ఈచోట ప్రసక్తానుసారము స్మృతిగోచారమయిన విషయమొకటి విన్నవించెద, - ఈనడుమ బ్ర.శ్రీ వెల్లాల సదాశివశాస్త్రులవారును శేషశాస్త్రిగారును సరసభూపాలీయమునుగూర్చి వ్రాతమూలకముగా కావించిన చర్చలో ఆచర్య ముగింపునకు రాకముందే మదరాసులో వారితోడి సంభాషణలో నాకుందెలియవచ్చిన దేమనగా, - వారు మత్కృతాక్షేపములను మదీయసిద్ధాంతములుగా భావించి అట్లే శ్రీమత్సన్నిధిలో ప్రకాశపఱిచిరను విషయము. నాసిద్ధాంతమని వారు తలంచినది నాసిద్ధాంతముగాదు. ఆయాతావుల వారు అవలంబించిన మార్గమువలన వాస్తవసిద్ధాంతస్థానమును ఆపాదించునట్టి తద్విపరీతమును నేను హెచ్చరించితిని. వారావిషయమును ఒండుగా భావించినందున ఆచర్చనువారి యిచ్చచేత అంతటితో