పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హాసనమునధిష్ఠించియున్న పుంభావరూప భారతి ముదలయిడుటకన్న నాకు మహాభాగ్యమొండు గల్గునా? అంతకన్నను భాగ్యముండునేని అది యాముదల నెఱవేర్చుటయేగాని యొండుగాదు.

అర్ధకృతములైన పనులనుమందముగా నేనియు సమాప్తి కావించుకొనుటకై చేయచున్న ప్రయత్నములలో ఊబిలోబడిన యేనుగు చందమున మఱియుమఱియు నష్టిజంబాలముననేమునింగి, ఋణములపాలై రోగపీడుతుడనై తుదకు ఎమ్‌డన్‌నౌకవలని యత్యాహితసమయంబున కర్మకరులు కొలది దినములు పలాయితులగుడు తద్వ్యాజమున ముద్రాక్షరశాలను మూసివైచితిని ...... ముద్రాక్షర వ్యాపారమునకన్న జీవనాంతరము లేనివాడను, తద్వ్యాపారసాధనముకూడ కోలుపోవలసిన దశ ఈనెలలో ప్రాపించియున్నది. ఇంకనుం గ్రంథములు రచింపందలపులుంగలవు.

ఈసమయమున నన్ను శ్రీశ్రీశ్రీ యేలినవారు నిలువంబెట్టి కడచినసంవత్సరము నామీద మదరాసులో దర్పణ ప్రాసాదమందు, పొలయించిన వాక్ప్రసాదమును చిత్తమున నవధరించి, నాకు కొంచెముఋణమును రూప్యపంచసహస్రీపరిమితమును వృద్ధిరహితముగా సముచిత ప్రత్యర్పణకాల నిర్దేశపూర్వకముగా దయచేసిన నాకుంగలిగియున్న యీ సకలక్లేశ