పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పటికిని నాగ్రంథముల నిడుటయరుదే యని శ్రీ శ్రీ యేలిన వారికి విశదమే.

ఇట్లుండగా శ్రీమంతులు అష్టాదశ భాషాధురంధరులునగు ప్రొఫెసరు శేషగిరిశాస్త్రులవారు నన్ను ఎఱుకచేసికొని నాకు మిత్త్రధేయమై తాముగా యత్నించియు శ్రీ మిల్లరు దొరవారిని హెచ్చరించియు యూనివర్సిటీ పరీక్షాధికారమును నాకు ఇప్పించినారు. ఆమూలమున నాకు ప్రతిసంవత్సరము కలిగిన యాయతిచేత పూర్వఋణములను దీర్చికొని మగత ఆర్బతునట్టు నిధిలో వైచుచుండి క్రమక్రమముగా రు 2750 (2750)ల మొత్తముకాగానే నిధిమునుకలో దానింగోల్పోయితిని. ఆ మొత్తము మూలధనముగా అచ్చుకూట మేర్పఱచుకొనను వార్ధకమున పెన్షను నొసంగని యానౌకరిని మానుకొనను సంకల్పించుచుండగానే ఆధనము నష్టమయినందున నౌకరియందే నిలిచి కాలక్షేపము చేయుచుంటిని.

"ఇట్లెల్ల కాలమును తత్తత్కాలదీనతం దొలగించుకొను యత్నములచేత వ్యాపృతుడనైనందున భూలోకావతీర్ణ యుష్మద్రూపవిద్వత్కల్పకముయొక్క కరుణామరందలహరీ బహుళమైన కాదంబర్యాంధ్రీకరణాజ్ఞప్తి పుష్పము మచ్చిరముననే వ్రాలినను దానిని కైసేసికొనలేకయు ఫలమును తలయెత్తిచూడలేకయునుంటిని. ఇందఱుండగా నన్నేచేయుమని సర్వజ్ఞసిం