పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములను ప్రభువునకు తెలుపుకొనిరి. ఆజాబునుండి కొంతయుదాహరించు చున్నాడను.

"నావేతనము గ్రంథక్రయమునకును జీవనమునకును రెంటికిని చాలకున్నందున అపఠిత గ్రంథ సంపాదనార్థముగాను వైద్యార్థముగాను ధనాపేక్షినై ధనమలవడునను నభిలాషచేతను విక్రమార్కాది పురాతనరాజర్షి చరిత్రాభిమానిత చేతను తచ్చరిత్రపుస్తకములను సంస్కరించి సటిప్పణములనుగా ముద్రించితిని. ఇట్టి యుద్యమమువలన మున్నున్నలేమికి, తోడు ఋణములు సయితము సంభవించినవి.

"వానిని శమమొందించుటకై ముద్రాక్షరశాల నొక దానిని నిర్మించుకొని కథాసరిత్సాగరమును కొంత ముద్రించితిని. కొంతఋణమును వెంటనే ముద్రాక్షరశాలా సామగ్ర్యసర్వస్వవిక్రయముచేత తీర్చి, శిష్టఋణమును క్రమక్రమముగా నాజీతమువలననే తీర్చుచుంటిని.......

"ఆయతి చాలనందునను తదర్థమై యూనివర్సిటీ యాశ్రయముంగోరి నాగానంద శాకుంతలాది నాటకాంధ్రీకరణముంగావించితిని. ఒకానొక కారణంబున నాగానందము ఎఫ్.ఏ. పరీక్షకిడియు ఒకానొకరి కారణంబున పరీక్షా గ్రంథనియమనాధికారులు కడమ మదీయ గ్రంథములను పరీక్షలకిడకుండిరి.