పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లకునేను వారితో 'ఈగ్రంథమును ముద్రించుటకు నాకు ధనము రేబాల లక్ష్మీనరసారెడ్డిగారు దయచేసినారు. గ్రంథము ముద్రితమైనది. ఏల ఏలినవారు నాకు ఈధనమిప్పుడీయవలయును?" అని యడిగితిని. అంతటవారు "మీరు, గురువులు, మేముశిష్యులము, శూన్యహస్తముతో గురుదర్శనము చేయగూడదని మీరే ధర్మమేర్పఱిచితిరి. మీయనుశాసనమును మీయెడనైన మేము నెఱవేర్పవలదా? అందుకై ఇది ఆచారము జరుపుటగాని యొండుగాదు" అనిరి ఆప్రతిభకును ఆప్రసన్నతకును సంతుష్టుడనై కృతజ్ఞతాపూర్వకముగా ఆధనమును స్వీకరించితిని"*

శ్రీ మహారాజావారి యౌదార్యముంగూర్చియు, పాండిత్యాతిశయములంగూర్చియు లెక్కలేని యుదంతములను శ్రీ తాతగారు చెప్పగా వినియున్నాడను. నైషథాది గ్రంథములలోని సంస్కరణములంగూర్చి వారడిగిన ప్రశ్నలును తాతాగారొసంగిన యుత్తరములును వినోదముగానుండును. విద్యావిషయములయందు వారికి వీరే ప్రమాణము. తాతగారికి వారు రచించిన జాబులతో నొక ప్రత్యేకగ్రంథము వ్రాయదగును.

తాతగారు ఆర్థికదురవస్థపాలైన కాలమున తమ ప్రాపకవరేణ్యులైన యావిద్వత్ప్రభువున కొకజాబువ్రాసిరి. ఆ జాబులో తమజీవితచరిత్రను సంగ్రహముగావ్రాయుచు తమ క్లేశ

  • ఆముక్త - ఉపోద్ఘాతము.