పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములంజేయవలయును.- ఇత్యాదికృత్యము లెన్ని యోకలవు. ఆయుశ్శేషమును వీనిచే కొంత సఫలీకరించుకొనుట యొప్పును. ఆప్రాప్తి నేను పైని నివేదించిన మదీయమనోరథము శ్రీమత్కటాక్షాంకితమయినం గలుగును. ముందుగా కాదంబరి నాంధ్రీకరించెద; నావేడినఋణమును మదీయ బహుగ్రంథసంచయ విక్రయముచేతను, పయి నేనువ్రాసిన గ్రంథరచనలచేతను ఇట నాకు అచ్చుపనులను మన్మిత్రు లనేకులు సమకూర్పం గడంగి యున్నారు. కావున ఆపనుల యాయతి చేతనుందీర్చెదను. నావ్యాపారము ప్రకృతమున నదీమాతృకమయిన సుకృష్ట సుక్షేత్రము విత్తనములేక చల్లకము మానినందున కంపతంపరమయిన రీతింబొందియున్నది.

శ్రీశ్రీ యేలినవారు పరిషత్తునకు మహాధనమొసంగి యున్నారు. నెల్లూరు హైస్కూలు నిర్వహించుచున్నారు. ఆంధ్రదేశమందు ఎచటివారు రచించినదైనను ఆ నూతనగ్రంథమునకు పోషకులరై యున్నారు. నాకు నిరంతరము ఏకాశ్రయులు........ పరిషదాదులు ఏమిచేసినవో ఏమిచేయగలవో దివ్యచిత్తమునకు విసదమైయేయున్నది. శ్రీశ్రీశ్రీ యేలినవారు అనుగ్రహించు ప్రత్యుత్తరమును ఎదురుచూచుచున్నాడను.

వేదము వేంకటరాయశాస్త్రి
[జ్యోతిష్మతీ ముద్రాక్షరశాల, నెల్లూరు.]