పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రులవారికి కోపమువచ్చినది. తరగతిలో తాము పాఠముచెప్పునప్పుడు తమ యనుజ్ఞలేకయే లోనప్రవేశించుట మర్యాదగాదు. వెంటనే వారు 'I do my duty' (నేను నాధర్మమును నెఱవేర్చుచున్నాను) అని బదులిచ్చిరి.

ఈదెబ్బకు ఏమి బదులుచెప్పుటకును తోచక దొర వెడలి పోయెను.

కళాశాలలోని యథ్యాపకులలో నొకరు బ్రాహ్మణద్వేషి. దూషణముగా నేదో యొక పురాణాంతర్గత విషయమును చెప్ప నారంభించి, సరిగా తెలియక, తుదకు 'Here the rascality is ...' అని చెప్పనారంభించెను శాస్త్రులవారు వెంటనే Keep it to yourself అని బదులిడిరి అచట నుండినవా రందఱును గొల్లున నవ్విరి. ఆక్షేపకుడు మఱి మాటాడలేకపోయెను.

విద్యార్థులకు శాస్త్రులవారియందు గౌరవమును ప్రేమయు నుండినవి. మైసూరులో రెండమంత్రిగానుండి ప్రస్తుతము భరతపురమునకు దివానుగానున్న శ్రీ ఏ.వి. రామానాధన్‌గారు, 1938 సం. జనవరి 13 తేది జరిగిన క్రైస్తవకళాశాల పురాణ బాల సంఘసమావేశమునాడు ఇట్లునుడివిరి. "The great Andhra patriot and scholar, Vedam venkataraya sastriar, was not only an erudite Sanskrit teacher, but a great friend and GURU to every student, He instilled in us a genuine love of Sanskrit and an appreciation of the beautiful and the lofty in our ancient literature'