పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రులవారు తరగతిలో పాఠముచెప్పునప్పుడు విద్యార్థులు తదేకతానులై పాఠముగ్రహించువారు. శాస్త్రులవారు ఒకమారుచెప్పినది మరలచెప్పరు. విద్యార్థులు గట్టిగాచెప్పుడని యఱచినచో మఱింత మెల్లగా చెప్పువారు. తరగతిలో నుండునంతసేపు వారనిన విద్యార్థులకు భయము. ఇవలికివచ్చిన చాల చనువుగానుండువారు. వారు మధ్యాహ్నము తెచ్చుకొను కాఫీలను వారితోకూడ విద్యార్థులును గ్రహించువారు. మందమతులను వారివారి చిత్తవృత్తుల కనుగుణముగాబోధించి పైకి తెచ్చుచుండిరి. శిష్యులను లాలించుటలో నగ్రగణ్యులు. కళాశాలలలో విద్యార్థులు సమ్మెకట్టుట పరిపాటి. క్రైస్తవకళాశాలలో వారిదినములలో నెట్టి విద్యార్థులసమ్మెయైనను శాస్త్రులవారు క్షణము సంభాషించినచో మరల నావిద్యార్థులు తరగతులకు వచ్చి చదువుకొనవలసినదే. అట్టి సన్నివేశములలో దొర శాస్త్రులవారినే నియోగించుచుండువాడు. కళాశాలను వదలిన యనంతరము సయితము విద్యార్థులు. వారిని విశేషముగా నాశ్రయించుచుండువారు వారితో చెలిమిచేసి వదలిపోయినవారు లేరు. ఇతర కళాశాలలలోనుండి విద్యార్థులు సంస్కృతమునకును శాస్త్రులవారి బోధనుపొందుటకును వారి కళాశాలకే వచ్చుచుండువారు. శాస్త్రులవా రుండిన యా ఇరువదినాలుగు సంవత్సరములలో నొక మహమ్మదీయవిద్యార్థి యొకడే వీరి కళాశాలను వదలిపోయినవాడు అతనిని ప్రిన్సిపాలు, మిల్లరు దొరగారు "సంస్కృత విద్యార్థు లందఱును, ఎచటెచటినుం