పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గునుపాటి ఏనాదిరెడ్డిగారును, మఱికొందఱు నెల్లూరి పెద్దలును చేరి ఆంధ్రభాషాభిమాని సమాజమును 1899 సం. ప్రాంతమున స్థాపించిరి. పూండ్ల రామకృష్ణయ్యగా రొక కార్డులో వేంకటరాయశాస్త్రులవారి కిట్లువ్రాసిరి.

తే 1-5-99 నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు.

సంఘము నిన్నటిదినమున నేర్పాటైనది. పదముగ్గురు వచ్చిరి. ఇంకను రాగల యాదిత్యవారమునకు మఱికొందఱు జేరగలరు. ఇపుడు పరగ్రామములకు బోయియున్నారు. "ఆంధ్రభాషాభిమాని సమాజము" అని పేరిడినారు.....

విధేయుడు
పూండ్ల రామకృష్ణయ్య
8-2-1900 నెల్లూరు.

ఆర్యా, నమస్కారములు

...ఉష నేమి చేసినారు. హనుమంతరావు రామానుజాచారి మొదలగువా రచ్చటికే వత్తురు శ్రీనివాసన్ మార్చినెలలో జేరును. అందఱును మీదృష్టిపథముననేయుందురు. బహుశ్రద్ధతోనున్నారు ......ఏనాదిరెడ్డికిని నొకజాబువ్రాసినాను.

పూ. రా.
నెల్లూరు. 22-5-1900

బ్రహ్మశ్రీ మహారాజశ్రీ వేదం వేంకటరాయశాస్త్రుల వారి సముఖమునకు పూండ్ల రామకృష్ణయ్య అనేకసాష్టాంగ