పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నమస్కారములుచేసి చేయంగలవిన్నపములు-......ఇచట మననాటకసభవారు శాకుంతలమును యించుమించుగా పూర్తిచేసి యుషకు చూచుచున్నారు. రెండునాటకములు వేసినగాని ఖర్చులు కట్టిరావనియు నుష క్రొత్తదిగానుండుటచేత కొంత లోకరంజకముగా నుండుననియు వారి యభిప్రాయము ....... మీరు యెప్పుడు వత్తురో దానిని వ్రాయవలయును....

పూ.రా.

వేంకటరాయశాస్త్రులవారు సర్వధ్యక్షులుగా రామకృష్ణగారు ప్రారంభించిన యాంధ్రభాషాభిమాని సమాజము ఇరువది యైదేండ్లు చక్కగాజరిగినది. శాస్త్రులవారు సమాజమువారి ద్రవ్యవిషయమునందుమాత్రము ప్రవేశించువారు కారు. ఈసమాజమువారు శ్రీ శాస్త్రులవారి నాటకములందప్ప నితరాంధ్రనాటకములను ప్రదర్శింపరాదనియు, ఇతరుల నాటకములు నాటకములే కావనియు, శాస్త్రులవారికడ సంపూర్ణముగా శిక్షనొంది, ఒద్దికలుకుదిరినవని శాస్త్రులవారు తలంచువరకును నాటకములం బ్రయోగింపరాదనియు కట్టుదిట్టములతో సమాజమును జరుపసాగిరి.

శాస్త్రులవారును ప్రతిసంవత్సరమును వేసవికాలము సెలవులలో నెల్లూరికేగి తమశిష్యులకు తాము స్వయముగా నేర్పి ప్రదర్శింపించుచుండిరి.


___________