పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్ఘాతమున నిట్లు వ్రాసియున్నారు. "ఈలోకోత్తరనాటకము శ్రవ్య ప్రబంధముగా రంజించునేగాని దృశ్యముగా రంజింపదని పాశ్చాత్య సంస్కృతపండితులును నూతనమతప్రియులగు నస్మదీయులే కతిపయులును పలికిరి. కాని ఇది దృశ్యముగా నత్యంత రంజకమగు నని ఆబాల్యము నాతలంపుగానుండెను మదరాసు కృస్టియన్కాలేజి సంస్కృత ప్రథాన పండితుడ నైనంతట బి.ఏ., పరీక్షకు ఉత్తరరామచరిత్ర పఠనీయము కాగా నాశిష్యులకుం బై మతభేదమును నామతమునుందెలిపి తదీయస్థాపనార్థము వారిచేత ఈనాటకమును మదరాసు పౌరసౌధములో ఆడించి, ఇది రంగమందు అత్యంతరంజకంబనియు, అతి శాకుంతలమనియు క్రిక్కిఱిసిన వేగురు రసికవిద్వజ్జనులకు ప్రత్యక్షముం గావించి నాడను. ఆప్రయోగముజరిగి ఇప్పటికి (1920 నాటికి) ముప్పది సంవత్సరములయినను ఆ శంబూకదివ్యపురుషుని నామస్తుత్యాది పద్యంబులు ఇప్పటికిని నావీనులలో అనురణనముం గావించుచునేయున్నవి. సితాదిసకలపాత్రములును వారివారి చర్యలును కన్నులయెదుర ఇప్పటికిని మెలగుచున్నవి. అనంతరము ఎన్ని నాటకములుచూచినను ఈవిధముగా డెందమును బందిగొన్నట్టిది లేదు." అని

శాస్త్రులవారి శిష్యకోటిలోనివారు కొందఱు నెల్లూర నొకసంఘముగా చేరి ఆంధ్రగీర్వాణ నాటకములను శాస్త్రుల వారికడనేర్చి ప్రదర్శింపదలంచియుండిరి. వారి యాయుద్దేశము నెఱింగి శ్రీయుత పూండ్ల రామకృష్ణయ్యగారును, శ్రీయుత