చంద్రుడికి కుముదినీప్రియత్వంతో బాటు పద్మవైరమూ కవిలోకసిద్ధము; మహా కవి భట్టుమూర్తి ఒక విరహిణి నోట
శా. "ఈ వబుండవు నీటబుట్టితిసుమీ యేనంచు మోమోటపుం ద్రోవ ల్సెప్పగ సిగ్గుగాదె; - మరి, నీ తోబుట్టు శ్రీదేవి లీ లావాసంబుసిరుల్ హరింతు వనుచో నయ్యో కళాదుండు చే తోవీథిన్ సహజాధనాపహరణోద్యోగంబు నెగ్గించునే” చే
అని అనిపించాడు.
విరహిణులకూ, విధుమండలానికి చుక్కెదురు. తాపాపనోదన మౌతుందని తరిపి వెన్నెలలోకి వెళ్ళితే, అది సంతప్తాగ్ని కావటం ప్రబంధనాయికలకు పరిపాటి. చంద్రోపాలంభం చెయ్యని చేడియ అరుదు. ఒక అంగన “ఇంతులను ఏచే పాతకమే నీకు అజహత్కళంకమైన" దని ఆడిపోసుకుంటుంది చంద్రుణ్ణి. విప్రలంభనాయికల దృష్టిలో చంద్రుడు కటిక కసాయి. “గోవధ చేసే తురకల దైవంబవు నీవు మొదల దక్కక పాంథ స్త్రీ వధము సేయ రోయుదె?" అని ఒక అతివ అర్థాంతరీకరిస్తుంది. పాపము! చంద్రుడు వారి నోట తినరాని తిట్లు తింటాడు. అందరికంటే అతిగడుసరి వరూథిని.
తే.గీ. "త్రిపుర సంహార మొనరించునపుడు హరుడు బండి కల్లుగ నీమేను గండిచేసె నదియు సెలవారి తెగటార వైతి చంద్ర యకట! రోహిణియెడ నపథ్యమునజేసి.”
అని అతని చావును కోరుకున్నది. త్రిలోకకంటకుడవైన నీవు ఎప్పుడో ఒకప్పుడు నశింపకపోవని చ “ఒక పెను బాపరేడు చలమొప్ప రసాతలసీమకున్ చకో రకములు భూతధాత్రికి సురల్ దివికిన్ పగ దీరునట్లుగా మెకమెకపాటుతోడ నిను మ్రింగకపోరెపుడున్, త్రిలోకకం టకుడవుగాన నీ యొడలు నజ్జుగ జేసె కురంగలాంఛనా!” అని అతనిని బెదిరిస్తుంది.
ఒక ఆషాఢమాసవిరహిణి "కురంగం నీవద్ద ఉన్నా శక్రచాపానికి గురి కాకపోవడమూ, మెరపు వేడికి భయపడి పారిపోకపోడమూ చాలా చిత్రంగా ఉన్న” దని ఆశ్చర్యపడుతుంది. ఇతర వ్యాసాలు 853