ఆకారంతో చంద్రుడై క్రమక్రమంగా పూర్ణరూపాన్ని పొంది ప్రకాశిస్తుంది. నాయకుడి డాలుమీద చిత్రితమైన చంద్రరూపం రాత్రిళ్ళు ఆకాశంలోకి ఎగిరి వెన్నెల కాస్తుందని ఒప్పోజా గుంపువారి నమ్మకం.
'త్యుకియోమి' చంద్రదేవత 'ఇజాన' (పింటోవారి పరమాత్మ) దక్షిణ నేత్రం నుంచి ఉద్భవించాడని జపానువారి నమ్మకం. 'హెంగో' అనే చైనావారి చంద్రుడు పూర్ణంగా అమృతపానం చేయలేకపోవటం వల్ల స్వర్గానికి వెళ్లుతూ దారిలో ఆగిపోయిన 'త్రిశంకువు'. రాత్రిళ్ళు మాత్రమే ప్రకాశించే అతణ్ణి పట్టుకొని అహర్నిశలూ అమృతప్రదానం చేసేటట్లు చేసుకోవాలనే సంకల్పంతో, 'చిన్' జాతిపూర్వులు ఆకాశాన్ని అందుకునే మేడలు కట్టడానికి ప్రారంభించారు. వినికిడి వల్ల చంద్రుడిది తెలుసుకొని ఒక పెద్దవెన్నెల తుపాను రేపి ఆ సౌధాల నన్నిటినీ నేలమట్టం చేశాడు.
దొంగలకూ, గూఢచారులకూ అధిదేవత ముసల్మానుల 'షాహూర్' అనే చంద్రదేవత. త్రిమూర్తులలో ఒకడు. బాబిలోనియా జాతి త్రిమూర్తి గణంలో 'సిన్' అనే చంద్రదేవత, ప్రథమ - షమాస్ (సూర్యుడు) 'ఇష్ తార్' లతో బాటు.
గ్రీకుల చంద్రదేవత 'సెలినీ' యౌవన ప్రదాయిని; హృద్రోగాలకు కారకురాలు. సూర్యుడు (హెలియస్) ఉషస్సు (ఇనోయస్) లకు తోబుట్టువు.
ఈ నాగరక, అనాగరక పురాణాలూ, పుక్కిటి పురాణాలూ పురస్కరించుకొని ఆయా జాతుల్లో అనంతంగా సారవత్సాహిత్యమూ, జానపద సాహిత్యమూ పుట్టినది; నేటికీ పుడుతూ ఉన్నది.
సీ. "ఒక వేయి తలలతో నుండ జగన్నాథు తే. బొడ్డుదమ్మిని బ్రహ్మ పుట్టె మొదల, నతని గుణమ్ముల నతని బోలిన దక్షు డగు నత్రిసంజాతు డయ్యె నత్రి కడగంటి చూడ్కుల కలువల సంగడీ డుదయించి విప్రుల కోషధులకు, నమర ధరాతతి కజుని పన్పున నాథు డైయుండి రాజసూయంబు సేసి మూడు లోకముల చంద్రుడు గెల్చినట్లుగా మన భాగవతపురాణం పలుకుతూ ఉన్నది.