అని తెలుసుకోవటం, దాన్ని సముద్ధరించే కార్యక్రమవిషయంలో అత్యంతావశ్యకమైన అంశం. "కరవగ వచ్చునే బలిమి గాడిదకున్ పులితోలు గప్పినన్" అని తరువాతి కాలంలో చులకనగా చూడబడటం తటస్థించినా, ఒకనాడు స్వేచ్ఛా సంచారం చేస్తూ కదుపులు కదుపులుగా ఆసియా మహారణ్యాలల్లో గార్దభం విశృంఖల విహారం చేస్తున్న దినాలలో, అవి జగదేకవీరుడు సీజర్ మహాశయుని హయరత్నాలను వెన్నాడి పట్టుకొని హతమార్చి మిగిలినవాటిని త్రిప్పి పంపినట్లు యాత్రాగ్రంథాలవల్ల తెలుస్తున్నది.
ఇంతేకాదు, ప్రాచీనులైన ఈజిప్ట్ దేశీయులకు, రోమనులకు, గ్రీకులకు గార్దభం అతి పవిత్రమైన జంతువు. వారి దృష్టిలో ఇది ఎప్పుడో రసోద్రేకం కల్గినప్పుడు ఓండ్ర పెట్టటం తప్ప తెలివి తక్కువతనం లేని జంతువు. అంతేకాదు, మేధాసంపత్తి గల ప్రాణి. అమితమైన ఆధివ్యాధి నివారకములైన నంత విచిత్రశక్తులు గల జంతురాజము. పరోపకారం చేయటంలో, అన్యుల బాధను తాను అనుభవించటానికి అంగీకరించేది. వృశ్చికం కుట్టినవాళ్ళు దానిపై నెక్కి చెవిలో “నన్ను తేలు కుట్టిం" దని చెపితే వెంటనే ఆ బాధను తాను పుచ్చుకొని అవతలి వ్యక్తికి వ్యథానివృత్తి కలిగిస్తుందట!
అన్నీ చెప్పి రసరాజమైన శృంగారం విషయంలో గార్దభానికున్న ఘనతను కప్పిపుచ్చటం శ్రేయస్కరం కాదు. రాసభ భోగరాసిక్యాన్ని -
"ఆఘ్రాయాఘ్రాయ గంధం వికట ముఖపుటో దర్శయన్ దంతపంక్తిం ధావత్యున్ముక్త నాదో ముహురపి చ రసాత్ భ్రష్టయా పృష్ఠలగ్నః | గర్దభ్యాః పాదఘాత ద్విగుణిత సురతప్రీతి రాకృష్ణ శిశ్నో వేగాదారుహ్యముహ్యన్ అవతరతి ఖరః ఖండిత శ్చిరేణ |"
అని ఇలా వర్ణించటంలో అతిశయోక్తి అణుమాత్రం లేదు. "గర్దభ్యాః పాదఘాత ద్విగుణిత సురతప్రీతిః” అన్నది శృంగార రాసిక్యవిషయంలో పరాకోటినందున్న స్థితి అనటం ఛిన్న సంశయం. సత్యభామాపాదతాడిత శిరోరసికుడైన శ్రీకృష్ణుడే ఇందుకు సాక్ష్యము.
కామాంగ దైర్ఘ్యం వల్ల గార్దభం లైంగిక చిహ్నం (Sexual Symbol) గా రోమక లోకంలో విఖ్యాతి గన్నది. ప్రేమికులు శుభం కోసం గార్దభశీర్షాలను శయ్యలపై వ్రేలాడదీయించేవాళ్ళట! ఆప్రొడైట్ సయోనీసస్ల పుత్రుడైన వెరియపస్ అనే రోమక దేవత 'దుష్టో' కామోద్రేకవిజృంభణం నుంచి తన్ను తప్పించినందుకు 'ర్షియా' గార్దభాన్ని శ్రవఃకింకిణులతో అలంకరించి తన ఆలయాలలో గౌరవస్థానాన్ని కల్పించింది. చెడ్డ