పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/843

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మా సంఘ సభ్యులంగీకరిస్తారా? లోకంలో గార్దభమంటే అణుమాత్రమైనా గౌరవం లేకపోగా, తిరస్కార దృష్టి ప్రబలంగా ఉంది. ఎవర్నైనా గట్టిగా తిట్టాలంటే గార్దభం పేరు ముందు వినిపిస్తున్నది.

"ఆడిన మాటం దప్పిన గాడిద కొడుకంటు దిట్టగావిని అయ్యో! వీడా నా కొడుకని గాడిద యేడ్చెంగదన్న ఘనసంపన్నా!”

అన్న చాటూక్తి ఈ తిట్టుకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించింది. (దేశ) ద్రిమ్మరిని కంచర గాడిదలా తిరుగుతున్నాడంటున్నారు. ద్రిమ్మరితనం చేతకాకనేమో, ఆదరించి తిండి పెట్టేవాళ్ళు లేని కారణం వల్ల కలిగిన గార్ధభానికి గాలిగాడన్న పేరు పెట్టారు. గార్దభానికి మందబుద్ధికి మారు పేరుంది. కొండవీటి రెడ్డిరాజన్యుల శ్వేతచ్ఛత్రచ్ఛాయల్లో "కవితాసతి వీర విహారం చేస్తున్న రోజుల్లో "బూడిద బుంగలై... కొండవీటిలో గాడిద నీవునుం గవివి గావుకదా అనుమానమయ్యెడిన్" అన్నాడు మహాకవి శ్రీనాథుడు ఒకనాడు. గోధనమని చెప్పుకొన్నట్లు, గార్దభ ధనమని చెప్పటం ఏ కాలంలోనూ ఉన్నట్లు కనిపించదు.

గజాదుల్లో భద్ర, మంద్ర, మృగీ జాతులున్నట్లు గార్దభాలలో భద్రాది జాతులున్న విషయాన్ని ఏ శాస్త్రకారుడూ పరిశీలించినట్లు కన్పించదు. పైగా "కుట్టకుంటే కుమ్మర పురుగనటం లోకలక్షణం.” పేదకోపం పెదవికి చేటనే సామెత కనుకూలమైన స్థితిలో నేడు ఉండటంవల్ల కరవకపోతేనేం, శుద్ధసత్త్వ స్వభావం వల్ల గార్దభం కరవక పోవటం చేత మనుజలోకానికి కడు చులకనై పోయింది. ఎంత చులకన కాకపోతే "కరవగవచ్చునే బలిమి గాడిదలకున్ పులితోలు గప్పినన్?" అని అలికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుడు నాచన సోమనాథు డంతటి వాడంటాడా?

మాతా రుద్రాణాం దుహితా వసూనామ్ స్వసాదిత్యానా మమృతస్య నాభిః ప్రణువోచం చికితేషు జనాయ మాగా మూగా మదితు వధిష్ట! - ఋగ్వేదం - మండలము VII

"రుద్రులకు మాత, వసువులకు దుహిత, ఆదిత్యులకు భగిని. అమృత స్వరూపమైన దుగ్గానికి స్థానము అయిన గోవును ఓ మనుజులారా! వధింపకుడు.