సంభవించిన నాప్త బంధువునకుఁ బోలె సాయపడుట రాజనీతి. ఇట్టి తోడ్పాటతని
కొఱకై కాదు; మన కొఱకు!
ఈ ధర్మసూక్ష్మమును గమనించినాఁడు 'మెత్తని పులి' ధర్మరాజు, అజాతశత్రువు. ఘోషయాత్రాసందర్భము 'నారలు కట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులో విపద్భారము నొంది వందురిన (వారల) నుజ్జ్వలరాజ్య వైభవోదారులరై కనుం గొను ముదంబున’ కర్ణసచివుని మంతనమునకు లొంగి దుర్యోధనుఁడు పాండవులఁ బరాభవింప వచ్చినాఁడు. గంధర్వులచేఁతఁ విజితుడై చిక్కిపోయినాఁడు. 'సద్యస్కంధ' యజ్ఞదీక్షితుఁడై యున్న ధర్మజుని కడకు ప్రజలు వచ్చి తమ రారాజును విడిపింపుమని ప్రార్థించినారు. పూర్వవైరస్మరణ కలుషితుఁడు, ధీరోద్ధతుఁడు నైన భీముఁడు 'మనకుఁ జులుక నయ్యె మన చేయుపని గంధర్వవరులు కూడి తగ నొనర్చి రింతలెస్సయగునె యేభారమును లేక యూరకుండ నొందె మనల జయము' అని యన్నతోఁ బల్కినాఁడు. ఇది శత్రువులగూర్చి సర్వసామాన్యవ్యక్తి యొనర్చు నూహ. ధర్మజ్ఞుఁడిట్టి ప్రబల శత్రువునంత చులకనగఁ బోఁగొట్టుకొనఁ దలఁపలేదు. వారివలన నతని కీర్తి సకలలోక పరివ్యాప్తము కావలసియున్నది. అదియును గాక ప్రతిజ్ఞాపాలనానంతర మే ప్రజల నతఁ డేలుకొన వలయునో యట్టివారు వచ్చి ప్రభువును విడిపింపుఁడని ప్రాధేయపడినారు. ఇట్టి యపూర్వము, విశిష్టమునగు నవకాశమును బోఁగొట్టుకొనుటెట్లు? ఈ స్థితిలో దుర్యోధన శత్రువును విడిపించిన లోకమున, నందును ముఖ్యముగ, కురుసభయందు, నందును కురువృద్ధుల బుద్ధులందు నతనికి నీతిమంతుఁడని శౌర్యవంతుఁడని యెంతటి ప్రచారము జరుగును! పైకిఁ బలుకలేదు. కాని సర్వమును గమనించి తమ్ముల నందఱను, కాదు, ముఖ్యముగ భీముని - బలవంతపెట్టియైన నొప్పించి గంధర్వుల పైకిఁ బంపి గెల్పించి దుర్యోధనాదులు విడిపించి వారిని మఱియొక సుసమయమునకై నిలుపుకొనినాఁడు.
సాటిశత్రువుల యెడ నిట్టిమార్గమే యార్యనీతి. శత్రువుల యెడ వహింపవలసిన యుత్తమమార్గమును సూచించుచు నొక యజ్ఞాత రాజనీతిజ్ఞుఁ డిట్లు పలికినాఁడు.
141[1]మయూరంబ పోలెఁ బ్రియోక్తుల బలుకుచు శత్రుసర్పముల నడంపవలయు; జలంబులఁబోలె భూభృద్విభేదనంబుసేయ నోపియు మృదువు గావలయు; కాలుపఁ దెచ్చు కాష్ఠంబులు దలమోచినట్లు వైరులయెడ నోరుపుగలిగి జయింపవలయు నదీప్రవాహంబు విడఁద్రోవవలయు తీరద్రుమతృణంబులకుఁ బాద ప్రక్షాళనంబు
సేయునట్లు చెఱుచునంతకు శత్రునెడ సామంబులే పలుకవలయు'.- ↑ 141. మయూరంబవోలె - మడికి సింగన సకల నీతి సమ్మతము
____________________________________________________________________________________________________
82
వావిలాల సోమయాజులు సాహిత్యం-4