జీవనంబు వేఱఁజెప్పనేల?' యని సెలవిచ్చి పోషకులయందు శత్రుత్వాభిమానమునకు
దోహదసేవఁ జేసినారు. శత్రునిరాసక్రియానంతరము వారి కీర్తి వ్యాపింపఁ
బెద్దనార్యుఁడు 'అభిరతి కృష్ణరాయఁడు జయాంకముల న్లిఖియించి తాళసన్నిభముగఁ
బొట్టునూరి కడనిల్పిన కంబము సింహభూధర ప్రభు తిరునాళ్లకుం దిగు సురప్రకరంబు
కళింగ మేదినీవిభు నపకీర్తికజ్జలము వేమఱుబెట్టి పఠింతురిచ్చలున్' అని పలికినట్లు
మధుర కావ్యములఁ జెప్పి శాశ్వతకీర్తి నాపాదించినారు. అట్టి కృత్యములే జరుగకున్న
మహత్తర సామ్రాజ్యము లేర్పడియెడివి కావు. ఆటవిక జీవితమున నున్న యొకనాఁటి
సంఘము నేఁటి నాగరకరూపమున రూపొందెడిది కాదు. సామ్రాజ్యముల స్థాపించినది
శత్రుత్వము. సామ్రాజ్యములు భంగ్యంతరముగ సంఘవిస్తృతికి, సాంస్కృతిక
పరివ్యాప్తికిఁ దోడుపడినవి.
'శక్తివిహీనుఁడై నీ శత్రువు తాత్కాలికముగ లొంగినను నమ్మవలదు. కుటిల మైన బాణాసనము వంగిన కొలఁదిని బలీయము కదా!'యని 139[1]జబున్నీసా కవయిత్రి యనినది. ఇట్టి శత్రువుల వలనఁ బ్రయోజన మేమైనఁ గలదాయని ప్రశ్నింప నౌననియే సమాధానము. నిద్రాళువులమై యున్న మనలో నిద్రించు శక్తిని బ్రబోధించువాఁ డిట్టి శత్రువే! ఇట్టి వైతాళికుని మఱచు టెట్లు?
'నీ శత్రువులతోఁ దిరిగెడి మిత్రునకు దూరముగనుండు' మని 140[2]సౌదీకవి యుద్బోధించినాఁడు. శత్రురహస్యముల గుర్తించి మనకుఁ దెలియఁ జెప్పుటకు వారితోఁ జెలిమిఁ జేయు సఖుని గూర్చి భయమొంద నవసరము లేదు. అట్టివానిని మానసికముగఁ దూరముగ నుంచుట మర్యాదకాదు; అయిన దూరముగ నుంచుచున్నట్లు నటించుట యవసరము. అందువలన నతనిని మనము తమమూలమున నొక విరోధిగా భావించుచున్నామని భ్రమపడి వారాత్మ మైత్రినిఁ బ్రకటింపవచ్చును. వారు మనసు విప్పి చెప్పిన మాటలు నతఁడు మన చెవి వేయవచ్చును. ఒకవేళ శత్రువులతో వర్తించు సఖుడిట్టివాఁడు కాకున్న నతనిని మిత్రుఁడని వ్యవహరించుటయే యనుచితము.
అల్పుడైన శత్రువు నెల్లవేళల నవజ్ఞఁ జేసి యూరుకొనవచ్చును. వియ్యమునకుఁ గయ్యమునకు సాటి కావలయునని పెద్దలనినారు. అందుచే సాటిశత్రువును గూర్చి విశేషముగ నాలోచింప వలయును. ఇట్టి శత్రువే భంగ్యంతరముగ మనకు మిత్రుఁడు!
మిత్రులకంటె ననేక రీతుల సత్యమగు మిత్రుఁడు!! అట్టివానికిఁ బ్రాణభయము____________________________________________________________________________________________________
మణిప్రవాళము
81