Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రాచీనరాజన్యులకు శత్రుసంహారమొక మహాకృత్యము; కార్యసాధక నీతిశాస్త్రములు వారికిఁ గొన్ని గుణపాఠములు చెప్పినవి. అందొక యజ్ఞాతనీతిజ్ఞుడు పలికిన క్రిందివాక్యము లరినిషూదనక్రియల యందును నర్థవంతము లైనవి.

'రాజులకు సర్వకార్యంబులు మంత్రపూతంబులు కావున బుద్ధిసహాయులఁ గూడుకొని యుండవలయును. బుద్ధిసహాయులు ధనార్జకులు రణశూరులు నాదియగు కార్యపురుషులు కార్యకాలంబ కూర్తుమనుట గృహదాహం బగువేళ నూతి కుపక్రమించుట. వారికి వలయు ధనంబు లిచ్చుట సుక్షేత్రంబున విత్తనంబు బడినయట్లు. విభవం బెంతగల్గినను భోజన సహాయులు కల్గుదురుగాక కార్యసహాయులు కల్గనేర్తురే? మఱియు మూర్ఖుండు కార్యసహాయుఁడగుట యంధుం డంధునకుఁ దెరువు చూపిన యట్లు. వారివలన నొక కార్యంబు గల్గిన నది కాకతాళంబు, ఘుణాక్షర న్యాయంబును నగుగాని యథార్థంబు గాదు. రాజు చేపట్టిన మూర్ఖుడైనఁ గార్యవేది యగు ననందగదు. శివుండు గళంబున ధరియించిన కాలకూటం బమృత మగునె? మూర్ఖునందు కార్యంబిడుట తన్నుఁ జంపు రక్కసునిఁ దాన సృజియించుకొనుట. విఘ్న భయంబునఁ గార్యంబు విడచుట తొడుగు గలుగునని యారంభంబు విడచుట యజీర్ణంబగునని యాహారం బుజ్జగించుటయును...”

మన భారతీయ విజ్ఞాను లిట్టి సామాన్యధర్మములు గాక శత్రువుల యెడఁ బ్రయోగింపఁదగిన షాడ్గుణ్యములను, కూటప్రకాశ యుద్ధస్వరూపములను వ్యూహవిధానమును మిత్రనీతుల మూలమున నిరూపించి ప్రాచీన రాజన్యులకు శత్రుమారణతంత్రమున మహనీయ ప్రబోధమును కావించిరి.

142[1]ఎరిస్టోఫాని సను గ్రీకుతత్త్వవేత్త శత్రుభయము మూలమున మానవజాతియం దంతియ కాదు సమస్త ప్రాణికోటియందును సృజనాశక్తి యభివృద్ధి నొందినదని ప్రవచించినాఁడు. ఈ ప్రవచనమున ననంతసత్య మభివ్యక్తమగుచున్నది. శత్రువుల మూలమున సముద్ర గర్భమునఁ జరించు జంతువులఁ గొన్ని ఖడ్గములవంటి దంతములఁ బెంపొందించుకొనినవి. 'సన్ ఫిష్' శత్రుభయమువలన నెంతయో బరువెక్కుచున్నది. క్రిమికీటకములు వాతావరణమును బట్టి వర్ణమును మార్చు కొనుటయును, వాయుపథాంచలముల కెగసిపో రెక్కలఁ బెంచుకొనుటయును, నూతనకంఠధ్వనులఁ గల్పించి మోసగించుటయును నేర్చుకొనినవి. సూక్ష్మదృష్టితోఁ బరిశీలించిన నేఁటి నాగరకతలో బహుళాంశము రిపుభయ మూలమున రూపొందినదని

విస్పష్టముగఁ జెప్పవచ్చును. చైనావారికి శత్రుభయము లేకున్న జగద్విఖ్యాతి నొందిన
  1. 142. ఎరిస్టోఫానిస్ - క్రీ.పూ. 445-385) ఏఁబదినాలుగు సుఖాంతనాటకముల రచించిన గ్రీకు నాటకకర్త - The World's Greatest Comic dramatist;

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

83