పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


‘అమరాంగనాతుంగ
సంగతోన్నతవక్ష
ఘనసారకాశ్మీర
చర్చాసుగంధముల సొలసి,

             వెఱ్ఱి నైనాను నేను - ఇఁక
             విశ్వచాలన చేయలేను

ఖేచరీముఖసక
ర్పూరతాంబూలాది
వాసనానిఃశ్వాస
పవనచాలనలకున్ భ్రమిసి,

             వెఱ్ఱి నైనాను నేను ఇఁక
             విశ్వచాలన చేయలేను”

అని జగత్ప్రణుఁడై సదాగతి యగుట బాధపడిఁనాడు. కొన్ని సమయముల నెత్తావులు మునిఁగి యున్మత్తనృత్య మొనర్చు నాతనిఁగని పెద్దలు వినయవిధేయత లితనికి లేవని పలుకవచ్చును. ఇది పొరబాటు. అతని యణఁకువను గూర్చియు, వృద్ధగౌరవాభిజ్ఞతను గూర్చియు మన మహాకవి కాళిదాసు నడుగుఁడు, కులపతియగు వసిష్టాశ్రమమున కేఁగుచున్న సుదక్షిణాదిలీపుల మలయానిలుఁడు సేవించిన రీతి నా మహానుభావుఁడు తిలకించి యిట్లు కలకాలము వినఁ బల్కినాడు :

     'సేవ్యమానౌ సుఖస్పర్శైః
      సాలనిర్యాస గంధిభిః
      పుష్పరేణూత్కిరై ర్వాతై
      రాధూత వనరాజిభిః'

(చల్లనైనవియు, సాలతరు రసపరిమళమిళితము లైనవియు, కుసుమరజస్సుల రాల్చునట్టివియు సుఖస్పర్శగలవియు నగు తెమ్మెరలచే సేవింపఁబడువారై వారు తరలిపోయిరి.) ____________________________________________________________________________________________________

46

వావిలాల సోమయాజులు సాహిత్యం-4