భ్రమరాన్వేషణము
"శివ, శివా! యనమేలు తుమ్మెదా!
శివయన్న వినమేలు తుమ్మెదా!!
శ్రీకంఠుఁ డనుపూవు తుమ్మెదా!
మూఁడులోకమ్ము లయ్యెనే తుమ్మెదా!
ఆఱు రేకులపూవు తుమ్మెదా!
యది మీఱునే వాసనల తుమ్మెదా!
వేఱు సేయక నీవు తుమ్మెదా! శివుఁ
జేరి భజియింపవే తుమ్మెదా!!
అష్టదళముల మీఁద తుమ్మెదా! నీ
వంటి చరియింపవే తుమ్మెదా!!
సాకారమైయుండు తుమ్మెదా! పర
మైకాంతమునఁ జూడు తుమ్మెదా!!”
భిక్షుకుని కోమలకంఠము నుండి విడివడి సమీరసమీరిత మగుచు నీ భ్రమర
గీతి శ్రుతిపుటములఁ బ్రవేశించి నా స్నిగ్ధచిత్తమును ద్విరేఫాన్వేషణకుఁ బురికొల్పినది.
అది యుజ్జ్వల కావ్యోపవనవాటి. సాకూతమధుర కోమలవిలాసినీకలకంఠ కూజితప్రాయము. [1]శివతపోభంగ సమయము. హుతాశనునకుఁ డోడ్పడు మని వాయువు నెవరు ప్రేరేపింపవలయును? మన్మథునకు మాధవుఁడు సర్వ ప్రావీణ్యము మెఱసి తోడ్పడుచున్నాఁడు. మహాకవి కాళిదాసు వాసంత విలాసశ్రీ వహించియున్న పరమేశ్వరాశ్రమమునందు మదనుని రతిద్వితీయునిగఁ బ్రవేశపెట్టి యొక పొదరింట నుపవిష్ణుఁడై సమస్తమును రసనిషణ్ణచిత్తముతోఁ దిలకించుచున్నాఁడు. స్థాణ్వాశ్రమమున మదనాగమానంతరము చరాచరమైన సమస్త ప్రకృతియు నుజ్జ్వల రసప్రపూర్ణమై యొప్పుచున్నది. మిథునము లుత్కృష్ట ప్రేమరసావేశము గలవై యొప్పు దృశ్యములు భ్రమరాన్వేషణకై పర్యటించు నా కంటఁబడినవి.
అట గండుతేఁటి పూవనెడు నొంటికోరలో ముందుగ నెచ్చెలికిం ద్రాగనిచ్చి
యది త్రావమిగిలిన పుష్పరసము నానందరసోత్కరుఁడై త్రావుచున్నాఁడు. నా దృష్టి- ↑ శివతపోభంగ సమయము - ఇటనుండి 42వ పుట 1వ పంక్తి వరకు మహాకవి కాళిదాసు కుమారసంభవమునందలి 3 సర్గలోని శ్లోకములు విరివిగ గ్రహించితిని
మణిప్రవాళము
47