సంవత్సర ఫలాన్ని వినేటప్పుడు బ్రహ్మజన్మతః వినమని శాస్త్రాలు చెబుతున్నవి. దైవజ్ఞులు ఆ క్రమాన్నే అనుసరించి పంచాంగ శ్రవణము చేస్తున్నారు. ఈ కల్పకల్పనము వేదాలలో లేదు గాని, దాన్ని ప్రపంచించటానికి అవసరమైన బీజాలు కనిపిస్తున్నవి. 1. కల్పము : 14 మన్వంతరములు + 1 కృతయుగము = 14 (71 మహాయుగములు 1 కృతయుగము) +1 కృతయుగము 1 మహాయుగము 10+ 4,32,000 ఏండ్లు; కృతము × 4 × 4,32,000 సంవత్సరాలు, ఒక మన్వంతరము 810 × 4,32,000 + 4 × 4,32,000 ఏండ్లు కాబట్టి ఒక కల్పము
(14 × 714 + 4) × 4,32,000
4,32,00,00,000 ఏండ్లు. 'ఇందులో 714ను గుణకంగా గ్రహించటం వల్ల ఇది కేవల జల్పనం కాదనీ అయనాంశ పరిమాణాన్ని భావగర్భితంగా వ్యాఖ్యానించటమనీ, బ్రేసెండ్ మొదలైన పాశ్చాత్య విద్వాంసులు కూడా అంగీకరించారు'
(భారతి - సర్వధారి, కార్తికము పుట 476)
బ్రహ్మ మాసానికి 30 తిథులు (దినాలు) శ్వేతవరాహము, నీలలోహితము, వామదేవము, రథంతరము, గౌరవ, దేవ, బృహత్, కందర్ప, సత్య, ఈశాన, తమః, సారస్వత, ఉదాన, గారుడ, కౌర్మ, నారసింహ, సమాన, ఆగ్నేయ, సోమమానవ, తత్పురుష, వైకుంఠ, లక్ష్మీ, సావిత్రీ, ఘోర, వరాహ, వైరాజ, గౌరీ మహేశ్వర పితృకల్పములు.
కలియుగం క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 20 తేదీన గం.2 ని. 17 సెకండు 30న ఆరంభమైందని మనవారు సిద్ధాంతీకరించారు. వైవస్వత మన్వంతరానికి ఇంద్రుడు పురందరుడు, ఆదిత్యుడు, మరుత్తులు, అశ్విని, పసుపు, రుద్రుడు ఇత్యాదులు దేవతలు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్నులు సప్తర్షులు. సప్తర్షులు మన్వంతరాన్ని బట్టి మారుతుంటారు. సప్తర్షులను గురించి చూ. భారతి ఈశ్వర చైత్రము; భారతి ఈశ్వర మాఘము; వీరిలో కొందరు ప్రజాపతుల్లో ఉన్నారు. ప్రజాపతులు రవిసోమాది గ్రహాలనటానికి చూ. Planets, Prajapatis and plexuses - C. J. Ghatak Astro, Maga... No. 1 pp 70-73
ప్రాచీన ఖగోళము శ్రీ వేలూరి శివరామశాస్త్రి, భారతి - సర్వధారి. పు. 604
గుప్తశకం. క్రీ.శ. 320లో ప్రారంభమైనదని డాక్టరు ఫ్లీట్ (1. A.Val X VIII)
క్రీస్తుశకాన్ని క్రీ. శ. 533లో డయోనిసియస్ ఎక్సిగ్ నస్ అనేవాడు ఏసు కాల్పనిక జన్మతిథినుంచి ఒక అబ్దారంభం చేయాలని నిర్దేశించాడు. క్రీ.శ. 6వ శతాబ్దిలో ఐరోపాలో అన్ని దేశాలవారూ ఈ అబ్దాన్ని అవలంబించారు. 381