పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

    

     ప్రత్యమావాస్య సంభవ దర్మసంయోగ
         కలితాధికోష్టిమఁ గ్రాఁగి క్రాఁగి
     విప్రయోగోష్ణ పాంథ ప్రాణపరిపాన
         భూమజంబగు కాఁక పొంది పొంది

తే. కాలకూటాహ్వయభ్రాత పాలుపట్టి
    పుచ్చుకొను దాహకత్వంబు ప్రోచి ప్రోచి
    యింత వేఁడిమి సాధించి తేమొ చంద్ర!
    నన్ను నేఁచుటకే ప్రయత్నంబుతోడ!”

యని యొక విరహిణి నిశాకరుని 'వేండ్రపుం బ్రకృతికి' వింత వింత కారణముల వెదకి చెప్పినది. చంద్రికాతాపమును సహింపఁ జాలక [1]కురంగము నీయందున్నను శక్రచాపమునకుఁ గుఱికాకుండుట, విద్యుదుష్ణమునకు వెఱచి పర్వులెత్తకుండుట లెంత విచిత్రము'లని మఱియొక విరహిణి వాపోయినది. విసిగివేసారిన యొక గడుసరియైన విప్రయోగిని చంద్రుని చేతనైనంతగ నుపాలంభించి తుదకు :

తే. [2]త్రిపురసంహార మొనరించు నపుడు హరుఁడు
    బండి కల్లుగ నీ మేను గండి సేసె
    నదియు సెలవారి తెగటార వైతి చంద్ర!
    యకట! రోహిణియెడ నపథ్యమునఁ జేసి”

యని చంద్రక్షయము నాకాంక్షించినది.

చంద్రునియెడ నిట్టికోర్కె యెంతటి పాతకము! కాముకులకు విచక్షణజ్ఞాన మెక్కడిది? ప్రియులు చేకూరిన వేళ నీ చంద్రుఁడే ప్రియదర్శనుఁడు కాఁడా? అమరుల బోనపుట్టిక, సహస్రమయూఖుని జోడుకోడె, సంతమసము వేరువిత్తు, పుంశ్చలీసమితికిఁ జుక్క వాలునగు నమృతకరుని యనామయము లోకక్షేమమే కదా! వలరాజు మేనమామ, మధుకైటభారి మఱఁది వంటి మనోహారదైవత మెటనున్నాడు? ఓ చంద్రా!

ఉ. [3]ఈ వెన్నెల పేరిదారముల వెండి హొరంగు పటంబు నల్లి మ
    ధ్యన్నెఱిగూడు కట్టుకొని యాపెనుదారపు చిక్కులందు
    పున్నమదీప్తిచే నిరులపుర్వులుపట్టి పలార్చుచున్న నీ
    యన్నువ వెన్నెలల్ చలువ లై మరి మాకుఁ బ్రసన్న మయ్యెడున్.”

వావిలాల సోమయాజులు సాహిత్యం-4

  1. కురంగము నీయందు, - మనుచరిత్ర
  2. త్రిపురసంహార - మనుచరిత్ర
  3. వెన్నెల పేరిదారముల - శ్రీ విశ్వనాథ 'శశిదూతము' నుండి.
    మలయానిలుఁడు

38

వావిలాల సోమయాజులు సాహిత్యం-4