వ్యాసుడు : పాశ్చాత్య విమర్శ
పురాణాలలో కనిపించే ఇరువది ఆర్గురి లెక్కను జూచి, వ్యాసనామం మీద చెల్లుబడి ఔతున్న బహుళ గ్రంథజాలాన్ని జూచి ఇతమిత్థమని నిర్ణయించలేక, సంస్కృత వాఙ్మయ పరిశోధన చేసిన పాశ్చాత్య రచయితలు కొందరు వ్యాసుణ్ణి చరిత్రాత్మక వ్యక్తిగా పరిగణించలేదు. హాప్కిన్సు "ది గ్రేట్ ఎపిక్ ఆఫ్ ఇండియా" అనే గ్రంథంలో "In other words there was no one author of the Great Epic, though with not an uncommon confusion of the editor with the author, an author was recognised, called Vyasa. Modern authorship calls him the unknown, Vyasa for convenience, but this Vyasa is a very shadowy person. In fact his name probably covers a guild of revisers and retellers of the tale" అని వ్యాస భగవానుణ్ణి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినాడు. కీత్, మేగ్డానెల్ వంటి పాశ్చాత్య పండితులు స్వల్ప భేదాలతో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.
ప్రాచ్యుల అభిప్రాయాలు
కాని చారిత్రక రంగంలో భారతీయులు ప్రవేశించిన తరువాత ఆ అభిప్రాయాలు పరాస్తాలైపోయినవి. భారతజాత్యుద్ధరణ కోసం, ధర్మసమైక్యత కోసం వ్యాస భగవానుడు భారత భూమిలో అవతరించి, శిష్యుల మూలంగా ధర్మస్థాపన చేసిన చారిత్రక వ్యక్తి అని వీరు నిరూపించారు.
మహాభారతములోని శకుంతలోపాఖ్యానంలో దుష్యంతుని కాలంలో కృష్ణద్వైపాయన వ్యాసుడు పదసంహితాసహితంగా అథర్వ వేదాన్ని అధ్యయనం చేసినట్లున్నది. ఆచార్య శంకరులు సూత్ర భాష్యంలో (3.3.32) "తథాహి అపాంతరతమా నామ వేదాచార్యః పురాణర్షిః విష్ణు నియోగాత్ కలిద్వాపరయోః సంధా కృష్ణ ద్వైపాయనః సంబభూవ - ఇతిస్మరంతి” ఇతిస్మరంతి" - అని ప్రవచించారు. అందువల్ల అపాంతరతముడనే వేదాచార్యుడూ, ప్రాచీన మహర్షీ కలిద్వాపర సంధి సమయంలో కృష్ణద్వైపాయనుడుగా అవతరించాడని ఆచార్య శంకరుల అభిప్రాయము. ఈ అభిప్రాయాన్ని తరువాత కాలంలో పుట్టి అహిర్బుధ్న్య సంహిత (11) అంగీకరించి వాక్పుత్రుడైన వాక్పుత్రుడూ, వాచ్యాయనాపరనాముడూ అయిన అపాంతర తమ మహర్షి ఒకమారు వేదవిభాగం చేసి, విష్ణునియోగం వల్ల తిరిగి వేదవ్యాసుడుగా జన్మించి పునర్విభాగం చేసినాడని పలుకుతున్నది. 356 వావిలాల సోమయాజులు సాహిత్యం-4