Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్న వాయుపురాణ వాక్యం వల్ల (53, 10) సూర్యునికి కారణం జ్యోతి అని అర్థమౌతున్నది. చాక్షుష మనువు కాలంలో అదితికి కాశ్యపునివల్ల విశాఖానక్షత్రాన సూర్యుడు పుట్టినాడనీ, (53,3) వర్షానికి అతడే కారకుడని (51, 21) విష్ణుపురాణ, వాయుపురాణాలవల్ల వ్యక్తమౌతున్నది. ఆదిత్య శబ్దాన్ని యాస్కాచార్యులు 'ఆదత్తే రసాన్ భాసాన్ జ్యోతిషి' అని నిర్వచించారు. పురాణాలవల్ల సూర్యుడికి సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంయద్వను, అర్యవసు, స్వరలనే ఏడు కిరణాలు (సప్తాశ్వాలు) ఉన్నట్లు తెలుస్తున్నది. గురు శనులు సూర్యునిలోని మబ్బులట. బృహత్సంహితలో ఈ వైజ్ఞానిక విషయం నిరూపితమైంది. 'నక్షత్ర గ్రహతారాణా మధి పో విశ్వభావనః తేజస్వీ, ద్వాదశాత్మా నమోస్తుతే' అన్న విష్ణుపురాణ వాక్యం వల్ల (10-40) కాలాధినాథుడుగ సూర్యుడు ధ్యానితు డౌతున్నాడు.

సూర్యుణ్ణి గురించి అనేక ఇతిహాసాలు వేదాల్లోనూ, పురాణాలలోనూ కనిపిస్తున్నవి. ఋగ్వేదంలో (175-4) ఇంద్రుడు సూర్యుని రథ చక్రాలను గ్రహించినట్లు ఒక గాథ ఉంది. రాహు కేతువుల గ్రహణము రామాయణములో ఉన్నది. సూర్యునికి 'సూర్యా' అనే కుమార్తె ఉన్నట్లును, ఆమె అశ్వినీ దేవతలతో కలిసి వారి రథము మీద తిరిగినట్లు ఋగ్వేదమున అనేక స్థలములందున్నది. ఆమెకు పూషునితోనూ, చంద్రునితోనూ సంబంధమున్నట్లు (మం. VI ఋ 58-4) తెలియుచున్నది.

సూర్యుడు కవి ఐనట్లు ఋగ్వేద మంత్రము లున్నవి. యాజ్ఞవల్క్యునికి వేదార్థములను బోధించాడట. సూర్యుడు 'సంజ్ఞ'ను వివాహమాడగా నామె అతని ప్రతిభను సహింపలేక 'ఛాయ' యను పరిచారికను అతనికిచ్చి, అరణ్యములకు పోయి ఆడగుర్రపు రూపము పొంది ఉండగా సూర్యుడు మగ గుర్రమై ఆమెతో విహరింపగా అశ్వినీ దేవతలు జన్మించినట్లు ఒక ఇతిహాసమున్నది. సంజ్ఞాదేవి తండ్రి అల్లుని ప్రతిభను తగ్గించటానికి ఒక కొలత బద్ద నెక్కించి ఎనిమిదవ వంతు తెగగొట్టగా విరిగిన భాగం వల్ల విష్ణుచక్రము, శివుని త్రిశూలమూ, కార్తికేయుడి బరిసె కలిగినట్లు పురాణాల్లో కొన్ని ఇతిహాసాలు కనిపిస్తున్నవి.

భారత దేశంలో అనాది కాలం నుంచీ నానా రూపాల సూర్యోపాసన కనిపిస్తున్నది. ఛాందోగ్యాది ఉపనిషత్తులలోనూ, సౌరమంత్ర పాఠములలోనూ సూర్యకిరణారాధన మున్నది. సూర్యుడు భారతములో అష్టోత్తర నామాలతో కీర్తితుడైనాడు. స్కాందమున సూర్యుని అష్టోత్తరము, గాయత్రీ ప్రభావమూ కన్పించుచున్నవి. 'దైవమైన సావిత్రి 352 వావిలాల సోమయాజులు సాహిత్యం-4