Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'సర్వదేవాత్మ కోహ్యేషు తేజస్వీ రశ్మిభావనః । ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధః ప్రజాపతిః | మహేంద్రో ధనదః కాలో యమస్సోమోహ్యపాంపతిః || పితరో వసవస్సాధ్యో హశ్వినౌ మరుతో మనుః । వాయుర్వహ్ని ప్రజాప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ॥'

అని పలికి 'సూర్య ఆత్మా జగతస్తస్థు షశ్చ' అన్న శ్రుతి ప్రమాణాన్ని ప్రపంచీకరించాడు. ఆ అభిప్రాయాన్నే సంధ్యావందన మంత్రం 'హిరణ్య వర్ణాశ్శుచయః పావకా, యాసు జాతః కశ్యపోయా స్విన్ద్రః యా గర్భం దధిరే విరాపాస్థాన అపశర్మ్యధ్ స్యోనాభవంతు (బంగారు రంగులు కలవీ, పరిశుద్ధము లైనవీ, పావనం చేసేవీ, వేని యందు సూర్యుడు, ఇంద్రుడు పుట్టినారో, ఏ పరమాత్మ అగ్నిని గర్భాన ధరించినాడో, విశ్వరూపి ఐన ఆ పరమాత్మ మాకు శుభాలు ఇచ్చుగాక!' అంగీకరిస్తున్నది.

ఋగ్వేదంలో 'ఆదిత్యవర్గం' కనిపిస్తున్నది. అందులో సూర్యుడు తప్ప తక్కినవారు జ్యోతిర్గోళ స్వరూపాన్ని పొందినట్లున్నది. కొన్ని సందర్భాలలో వారు సూర్యునికి పర్యాయనామములుగా వర్ణితులైనారు. ఋగ్వేదం (మం. VII 36-2) సూర్యుడు, సావిత్రి ఉషానాథులనీ, (మం. VII ఋ75-5) సూర్యుడు అదితి పుత్రుడనీ ఉన్నది. సావిత్రీమైత్రేయులు అదితి పుత్రులట. (మం. VIII 18-3; 11-271). సూర్యుడు ఏడు గుర్రాల రథాన్ని ఎక్కి వస్తాడని (VII-60-3), సావిత్రి రెండు గుర్రాల రథము ఎక్కుతాడట (మం.1-35-2). వీరు దుస్స్వప్న దోషాపహర్తలనీ, పిశాచాలను పారద్రోలగలవారనీ (X-37 (4) 1-3-6) ఉన్నది. ఈశోపనిషత్తులో వర్ణితుడైన పురుషుడు ఆదిత్యవర్గంలోని వాడే. తదుపరి ద్వాదశాదిత్యులైనారు. సూర్యుడు విష్ణ్వంశ సంభూతుడైనాడు. విష్ణు పురాణంలోని 'వైష్ణవోం శబరస్సూర్యః అంతర్జ్యోతి రసంపం అయాయాత మోంకారం తస్య తత్ప్రేరకం పరమ్' అన్న వాక్యాలవల్ల సూర్యుడు విష్ణ్వంశ సంభూతుడనీ, ఓంకారము అతనిని ప్రేరేపించగలదనీ తెలుస్తున్నది. క్రమంగా ఆయన సూర్యనారాయణుడైనాడు.

యాస్క సిద్దాంతాన్ని బట్టి దేవతలు ముగ్గురే. 1. సూర్యుడు, 2. అగ్ని 3. వాయువు. భూలోకదేవత అగ్ని అంతరిక్ష దేవత వాయువు, ద్యులోక దేవత సూర్యుడు. మిగిలినవారు సూర్యునివల్ల ఉద్భవించినట్లు నిరుక్తం నిరూపిస్తున్నది. 'పత్య తేచాగ్ని దిత్య ఉదకం చందమాస్మృతః, శేషాణాం ప్రకృతిం సమ్యగ్వర్థ్య మాణాం నిబోధత'