విశ్వరూపిక, యమజిహ్వ, జయంతి, దుర్జయ, యమాంకిక, విరాళీ, భేతీ, విజయంతిక, దేవకి, యశోద, నంద, అంబ, సర్వమంగళ, కాళరాత్రి, లలిత, జ్యేష్ఠా, నీలజ్యేష్ఠా, భూతమాత, సురభి, యోగనిద్ర, శ్రీ, చాముండ, చండిక, నవదుర్గ, రౌద్ర, కాళీ, కలవికర్జీ, బలప్రమథినీ, మనోన్మనీ, కృష్ణా, ఉమా, పార్వతీ, మహాకాళీ, శివరాత్రి, వారుణీ, శివదూతీ, కాత్యాయనీ, కార్త్యాయనీ, అభయ, అంబిక, యోగేశ్వరీ, భైరవీ, రంభా, శివా, తుష్టీ, సిద్ధి, బుద్ధి, క్షమా, దీప్తి, రతి, శ్వేతా, వైష్ణవీ, ఐంద్రీ, యామ్యా, కౌమారీ, వారాహీ, బ్రాహ్మీ, సరస్వతీ, లక్ష్మీ, సావిత్రీ, సర్వగంధా, గంధేశ్వరి, శక్తి, ఆశా, బృహత్ముక్షీ, సర్వజ్ఞా, వామనీ, భయాతన, ఖగానన, తపనీ, క్రోధన, వమని, మహాక్రూర, లోలుప, హాహారవ, పిశితాశా, బడబాముఖి, పిశాచి, హుంకార, పిచువక్త్ర, విశాలాక్షి, విమల, చంద్రావళి, లాలస, చంద్రహాసన, లంకేశ్వరి, వరద, లంకా, కాలకర్ణి, లోల, ప్రచండోగ్ర, లయ, మేఘనాద, లీలా, కరంగినీ, బాల, విష్ణుజిహ్వా, క్షయా, రక్తాక్షి, అక్షయ, తాలుజిహ్వక, పింగాక్షీ, సవరాక్షపణ, ససంగ్రహి, వృక్షకర్ణి, హయాసన, తరళ, తార, అక్షోభ్య.
అంటే ప్రకృతిలోని ప్రతి శక్తినీ ఒక దేవతా రూపంలో ప్రాచీనులు నిరూపించారని ఈ అనంతకోటి దేవతా స్వభావాదులను బట్టి తెలుస్తున్నది. ఆసేతుశీతాచల పర్యంతం విశాలమైన భారతదేశంలో ఉన్న దేవాలయాలలో ఈ దేవతారూపాలు శిల్పాకృతి ధరించినవి. నేడు శిల్పాచార్యులమని చెప్పుకునే అనేకమంది విజ్ఞులకు కూడా అవగతం కానన్ని దేవతామూర్తులున్నవి. తంత్రగ్రంథాలను పరిశీలించి ఈ శిల్పమూర్తుల స్వరూపాదికాలను తెలుసుకోవలసిన విజ్ఞానం విశేషంగా కనిపిస్తున్నది.
ఈ దేవతామూర్తులలో విలక్షణ రూపాలు కలిగిన వాటిని గురించి కొలదిగా ప్రసంగించిన తరువాత, మహిషాసురమర్దని, దుర్గ, కాళీలకు రూపకల్పనావశ్యకతనూ, భావనా వైచిత్రినీ నిరూపించుట సమంజసము. వికృత ఉష్ణ వాహన భయకృత మస్తకము మీద శవశకలం ఉంటుంది. 'ముసలం ముద్గరం యావ్యే పరశుం బంధనం తథా, బిభ్రతి యమజిహ్వా స్యాత్ కరాళా మహిషాస్థి' అనేది యమజిహ్వా స్వరూపము. బిడాలీ దేవత రూపము చిత్రాతిచిత్రమైనది. 'శకటస్థాతి ఘోరాస్యా క్షీర వర్ణాయమాంతికా, మార్జారస్థ బిడాలీ చ విశాలాక్షీ భవేత్ సితా' అని ఆమె స్వరూప నిరూపణము. విజయాంతిక దుర్గాపూజలో ఉపవిగ్రహమైన విజయ. అంబను తైత్తిరీయ సంహిత 'ఏషతే రుద్రభాగః సహస్రాంబిక యాతం జుషస్య' అని రుద్రునికి భగినిగా చెప్పుచున్నది. సర్వమంగళ జగద్ధాత్రు లిరువులు నేకరూపలు కాళరాత్రి స్వరూప ఐన మహామాయను336 వావిలాల సోమయాజులు సాహిత్యం-4