Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



మ. [1]"కడఁక న్రేచలిగట్టుపట్టిఁ దను వేడ్కం గూర్ప నే తెంచి పై
     జడిగాఁ జుక్కలతూపు లేయ గినుక న్జాబిల్లిముక్కంటి దాఁ
     బొడుపుం గెంపను వేఁడికంట నిరులు న్పూవిల్తు మే నేర్చి చొ
     ప్పడఁ దద్భూతి యలందెనా నపుడు బింబం బొప్పెఁ బాండు ద్యుతిన్.”

అని ప్రహర్షహృదయముతోఁ బలికినాఁడు.

శశికిని, శివునకు సన్నిహిత సంబంధము. అది యతఁ [2]“డనలాక్షు ఘనజటా వనవాటికి వన్నె వెట్టు ననార్తవంపుఁ బూ" వగుటయే యనుట నిస్సంశయము!

పరిపూర్ణ చంద్రబింబమును గని ప్రౌఢభావుకులు పరిపరివిధముల నూహించిరి. అందు శకునజ్ఞుఁడు దేశసుభిక్షార్థియు నగు నొక మహాకవి :

ఉ. [3]"పొందుగఁ పశ్చిమాబ్ధి తటభూస్థలి నంశుమదంశుమత్ఫలా
      కందము వాసరాంతహలికప్రవరుం డిడ సాంధ్యవారిభృ
      త్కందళము ల్తమోదళ యుతంబులునై గెల పండి వ్రాలెఁ బూ
      ర్ణేందుని పేరఁ బ్రాచి నది హేతువు వెన్నెల కల్మి కల్మికిన్.”

అని సప్రమాణముగఁ బల్కినాఁడు.

చ. [4]"పనుపడ వేణునాళములఁ బగ్గములం బలెఁ గ్రిందఁ బర్వు శో
       భన కిరణ ప్రకాండములు భాసిలఁ జందురుఁ (డొప్పి యెం) తయు
       న్మనసిజుఁ డెల్ల ప్రాణుల మనంబులు చేలుగ రాగబీజముల్
       పెను జతనంబుతోడ వెదఁ బెట్టెడు రౌప్యపు జడ్డిగం బనన్.'

గనుపట్టిన నొక మహాకవి చూచి సంతోషభరితాంతఃకరణుఁ డైనాఁడు.

[5]తుహినకరమండలంబునం గురియు నప్పండు వెన్నెలలు సాయంతననటన చటుల మహానట వికటాట్టహాసంబుల కను ప్రాసంబులు. పూర్వపారావార పులినతల విహర ణైరావణ కరపుష్కరోద్ధూత వాలుకాధూళికలకుం బ్రత్యా దేశంబులు. అంధకార బలీంద్ర నిర్బంధన ధురంధర సమయ మధుమథన చరణాంగుష్ఠ నిష్ఠ్యూత గగనసరి దంబుపూర్వంబులు కనుబింబంబులు.’

'శరత్తు చంద్రికలది' [6]'ఋణ మపరిహార్యమైన పాపము గనుక నట్టి పాపము చేత విముక్తుఁడైన మనుజునిమాడ్కిఁ జంద్ర గర్భితములైన మేఘము లీ శరత్తున

నొప్పారును.'
  1. కడక న్రేచలి గట్టుపట్టి - పారిజా. ఆ. 2. ప. 45
  2. అనలాక్షు - మనుచరిత్ర వంశావతార వర్ణనమున 'కలశపాథోరాశి' నుండి
  3. పొందుగఁ బశ్చిమాబ్దితట - పారిజా. ఆ. 2, ప. 42
  4. పనుపడ వేణునా - సూరన ప్రభా. ప్రద్యు. ఆ. 4. 124
  5. . తుహినకర మండ - పారిజా. ఆ. 2, ప. 53
  6. ఋణ మపరిహార్యమైన - శ్రీకృష్ణరాయలు ఆముక్త ఆ. 4. ప. 158

____________________________________________________________________________________________________

మణిప్రవాళము

33