గూడా చేర్చినాడు. ఈ మహాగ్రంథానికి రఘునాథరాయల గురువు గోవిందదీక్షితుడు వ్యాఖ్యానం వ్రాసినాడు. రఘునాథ రాయలు వీణావాదనలో దిట్ట అని దీక్షితులు “జయంతసేనాది రాగ రామానాందాది తాళాన్ రచయన్ నవీనాస్, సంగీత విద్వాంస ముపాదిశ స్త్వమ్ విపంచికావాద దక్షణానామ్' (J.O.R. Vol. III - 154) రీతిగా పలికినాడు. రాయలు వీణలలో నాలుగు రకాలను సూచించి వాటి అమరికను గురించి కొంత చర్చించినాడు. అతని పేరుమీద రఘునాథ మేళ నొకదానిని సృజించాడు. అతని ఆస్థానంలో సంగీత శాస్త్రనిధులు - స్త్రీ పురుషులు అనేకులు ఉన్నట్లు 'వాగ్గేయ కారప్రముఖై రనేకై ర్విచిత్ర గీతాదికళా ప్రవీణైః, తథైవ వీణాదిమవాదవిద్యా విచరక్షణైః క్వాపినిషేవ్యమాణః' అనే ప్రమాణం వల్ల తెలుస్తున్నది. ఇతని కొలువులో ఉండే అనేక నాట్యగత్తెల విలాసవిభ్రమాలనే 'శృంగార సావిత్రి'లో అశ్వపతి తపోభంగం చేయటానికి వచ్చిన అప్సరసలకు చూపించినాడు. వెంకటమఖి, రఘునాథ రాయల ఆస్థాన సంగీత విద్వాంసులలో ప్రముఖుడు. 'తుర్దండి ప్రకాశిక' అనే సంగీత శాస్త్ర గ్రంథ నిర్మాత. వీణ, శ్రుతి, స్వరము, మేళము, రాగము, అలాపనము, రాయ, గీత ప్రబంధాలు అనే 10 అధ్యాయాల గ్రంథము. రఘునాథుని వీణమెట్ల పద్ధతిని అనుసరించక, సప్తస్వరాలకూ సర్వ కాలసర్వావస్థల్లో ఒదిగేటట్లు మెట్లను సరస్వతీ వీణకే ఏర్పాటు చేసి, 72 మేళకర్తలను నిరూపించిన మహానుభావుడు వెంకటమఖి. ఇతడు జయదేవుని గీత గోవిందమార్గాన్ని అనుసరించి త్యాగరాజస్వామిమీద 24 అష్టపదులు చెప్పినాడట (భారతీయ సంగీతము - వీణ సుబ్రహ్మణ్యశాస్త్రి పే. 6)
కృష్ణరాయల కాలంలో అల్పప్రచారాన్ని పొందిన యక్షగానాలు రఘునాథరాయలు, అతని కుమారుడు విజయరాఘవరాయల కాలంలో విశేష వ్యాప్తిని పొందినవి. తంజావూరు కోటలో ప్రత్యేకంగా నాటకశాలలు కట్టించినట్లు ఆయన అంకితం పుచ్చుకున్న విజయవిలాసంలోని 'మాటల నేర్పులా సరసమార్గములా నాటకశాలలా... కీర్తిలోలుడు జుమీ రఘునాథ నృపాలుడిమ్మహిన్' అన్న పద్యం వల్ల వ్యక్తమౌతున్నది. రఘునాథరాజు స్వయంగా 'అచ్యుతేంద్రాభ్యుదయ' మనే యక్షగానం వ్రాయటమే కాకుండా, ఎలకూచి బాలసరస్వతి వంటి విద్వాంసుల దృష్టిని వాటిమీదికి ప్రసరింపచేశాడు. బాల సరస్వతి 'కల్యాణకౌముదీకందర్ప నాటకం' వ్రాసినాడు. రాయలకుమారుడు విజయరాఘవరాయలు కళాపోషణ కోసమే రాజ్యాన్ని పాలిస్తున్నట్లు శారదా ధ్వజాన్ని ప్రతిష్ఠించాడు. 50 యక్షగానాలు వ్రాసి ఆడించాడు. ఇతని కాలంలో తంజావూరు నాటకశాలల్లో నటించిన యక్షగానాలు 300కు పైగా ఉన్నవట. నాటకాలు ఆడేటప్పుడు రంగులు వేసుకొని పాత్రోచిత వేషధారణలతో ప్రజలనుసంస్కృతి 327