మొగములచాయ వేరొక చందముగ నిల్పి
కమలసంభవుడు ప్రేంఖణ మొనర్ప
.........
తే. శౌరి పూరింప నప్పాంచజన్యరవము' - ఉత్తర హరి. ఆ. 4-215.
ఇందుకు కొన్ని ఉదాహరణాలు. వసంత విలాసంలో నాచన సోమనాథుడు పేర్కొన్న జాజర పాటను తరువాత ఎంతో కాలానికి దామర్ల వెంగళ భూపాలుడు బహుళాశ్వచరిత్రలో చెప్పినాడు.
శ్రీనాథ మహాకవిని 'దీనారటంకాల తీర్ధమాడించిన' విజయనగర చక్రవర్తి ప్రౌఢదేవరాయలు సారంగదేవుని సంగీతరత్నాకరానికి వ్యాఖ్యవ్రాసిన కల్లినాథుణ్ణి పోషించాడు. (J.A.H. R.S. Pts. 2, 3, 4 page 204) సాళువ నరసరాయల కాలంలోనే మొట్టమొదటి యక్షగానం కనిపిస్తున్నది. అది ప్రస్తుతం ఉపలబ్ధం కాదు. కర్త చెన్న శౌరి. హరిభట్టు నారసింహ పురాణంలో 'సౌరభిచరితంబు జక్కులకథ చెప్పి లాలితనవరసాలంకృతముగ' అని తన పూర్వజుడు అన్న శారిని కీర్తించాడు. విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణరాయలు పాలిస్తూ దక్షిణాపథాన్నంతటినీ ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకు తెచ్చిన తరువాత, సమస్త కళాపోషణం విశేషంగా జరిగింది. సంగీత నాట్య సాహిత్య శిల్పాలు అన్యోన్యాశ్రయాలై ఇతని కాలంలో విలసిల్లినవి. చివరకు దుఃఖాన్ని కూడా సంగీతదృష్ట్యా కవులు, అవలోకించారు. శిల్పంలో 'సరిగమపధనిస స్వరవల్ల కీతుల్యరవ విఠోబాస్తంభ రాగఫణితి' గమనింపదగినది. ప్రబంధనాయిక లందరినీ 'వీణాప్రియ'లనుగా తీర్చిదిద్దిన కవులు కథానాయికల చేత ఏదో ఒక వీణను పట్టించారు. 'తరుణాంగుళిచ్ఛాయ దంతపు సరకట్ల నింగిలీకపు వింతరంగులీన' అన్నచోట 'సర' అనే ఒకానొక వీణను వరుథిని చేత పట్టించాడు పెద్దనామాత్యుడు. 'కిన్నర' వీణ కూడా ఆ దినాలలో ప్రచారంలో ఉన్నట్లు కవితా స్వరూప నిరూపణ చేసే సందర్భంలో 'కిన్నర మెట్ల బంతి సంగాతపు సన్నతంతు’ అన్నచోట ఆయన చెప్పినాడు. నయగారపు కన్నడి, గౌళపంతు ఇత్యాది రాగాలు ఆ నాడు ప్రసిద్ధి వహించినట్లు తెలుస్తున్నది. రాయలనాటి వీణమెట్లు ప్రస్తుత కాలంలో నిబద్ధాలై ఉన్నట్లు కనుపించదు. అవి వాతావరణాన్ని బట్టి, పాటకుని గొంతును బట్టి, రాగాన్ని అనుసరించి మార్చేవారు. మనుచరిత్రలో వరూథిని విరహావస్థలో ఉన్నప్పుడు చెలికత్తె పలికిన 'వాలారుం గొనగోళ్ళ నీ వలసతన్ వాయించుచో నాటకున్, మేళంబై, విపంచి నిన్న మొదలున్ నీవంటమింజేసి యా, యాలాపంబె యవేళ పల్కెడు324 వావిలాల సోమయాజులు సాహిత్యం-4