చేసినవాడనీ, అతని ప్రతిభను గమనించి ప్రభువు నృత్తరత్నావళీ రచన చేయలసినదని శాసించినట్లు అందులోని -
"ప్రేక్ష్య ప్రజ్ఞా మతిశయవతీం స్వామిభక్తిం చ, హర్షా దాకౌమారా ద్గణపతినృపో జాయనం యం సమర్థమ్ | శుండామాత్యే సకలసుమన స్సేవ్యమానో జయంతం నాచాంపత్యై హరిరివ కలా శ్లాఘనీయం వ్యనైషీత్ ॥ జిత్వా శౌర్యేణ పృథ్వీం జలనిధిరశనాం స్వస్థిరీకృత్య లోకం సంగీత స్యోపభోగం సకుతుకమనసః స్వామినః శాసనేన | తస్యాభీష్టస్య భాస్వన్మణినికరనిభం నృత్తలీలాయితస్య రాజోల సౌ శాస్త్ర మేత ద్రచయతి చతురం నృత్తరత్నావళీతి ||"
అన్న వాక్యాల వల్ల తెలుస్తున్నది.
కాకతీయుల కాలంలో వీరశైవంతో పాటు ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలలో కాలాముఖ పాశుపత శైవాలు కూడా విజృంభించినవి. పాశుపత గోళకీ మఠానికి గణపతి దేవచక్రవర్తి కుమార్తె రుద్రాంబ గుంటూరు జిల్లా మల్కాపురంలో కొంత భూమిని దానం చేస్తే, మఠాధిపతి విశ్వేశ్వర శివదేశికాచార్యులవారు దేవాలయం కట్టించి దాని అంగరంగ భోగలక్షణాలుగా ఇద్దరు నర్తకులను, అయిదుగురు ఆవజ కాండ్రను, తగిన వాద్యసంపత్తిని ఏర్పరచినట్లు తెలుస్తున్నది (J.A.H.R.S. Vol. IV. Pts. 8 & 4) వీరికాలంలో దేవాలయాలకు సంబంధించిన గాంధర్వ విద్యాప్రవీణుల జీవితాలు నాటకాలుగా కట్టి ఆడతగినట్లుగా ఉండేవట. క్రీడాభిరామంలో ఒక వారాంగన ప్రశంస మాటలమధ్య వచ్చినప్పుడు, మంచన శర్మ టిట్టిభ సెట్టితో 'లెస్సగాక, కిరాట! ఈ లేమచరిత మాడుదురు నాటకంబుగ నవనిలోన' అని చెప్పేవాడు.
కాకతీయుల పతనానంతరం క్రీ.శ. 14వ శతాబ్ది మధ్య భాగంలో బృహదాంధ్రదేశం 1. కోరుకొండ, 2. రాచకొండ, 3. పిఠాపురము 4. కొండవీడు, 5. విజయనగరము అనే ఐదు రాజ్యాలుగా ఏర్పడిపోయింది. కళాపోషణ విషయంలో వీరందరూ కాకతీయుల అడుగుజాడలనే అనుసరించారు.
కొండవీటి రాజ్యస్థాపనాచార్యుడు ప్రోలయ వేమారెడ్డి; ఎర్రాప్రగడ రామాయణ హరివంశాలకు కృతిభర్త. ఎర్రాప్రగడ హరివంశంలో కృష్ణుని జలక్రీడలను వర్ణించే సందర్భంలో 'లలితగగనరంగంబున, నలయక క్రొమ్మెరుఁగు గొండ్లియై యాడెడు చోసంస్కృతి 321