సీ. "గర్జించియరసి జంఘాకాండయుగళంబు వీరసం బెట క్రోల వ్రేయు నొకడు, యాలీఢపాదవిన్యాస మొప్పగ వ్రాలి కుంతాభినయము గైకొను నొకండు బిగువు కన్నుల నుబ్బు బెదరు చూపులతోడ ఫీట్కార మొనరించు పెలుచ నొకడు, పటుభుజావష్టంభపరిపాటి ఘటియిల్ల ధరణి యాస్ఫోటించి దాటు నొకడు,
తే. యుద్ది ప్రకటింప నొక్కరుం డోలనాడు బయలు గుర్రంబు భంజళ్ళు పరుపు నొకడు కొడుము దాటింపుచును పెద్ద కొలువులోన బడఁతి పల్నాటివీరులు బాడునపుడు.”
అన్నాడు. గుర్రపు భంజళ్ళు మహాకవి పింగళి సూరనార్యుని విశేషంగా ఆకర్షించినవి. అందువల్ల ఉదాత్తనాయకుడైన ప్రద్యుమ్నునిచేత ప్రభావతీ ప్రద్యుమ్నంలో ఆయన గుర్రపు భంజళ్ళు త్రొక్కించాడు. దేశీయ నాట్యమూ, సంగీతమూ విస్తారంగా ఆ దినాల్లో ప్రచారంలో ఉండటం చేతనే, కవి బ్రహ్మ తిక్కనామాత్యుని దృష్టి వాటిమీద నిలిచింది. ఆయన అర్జునుణ్ణి విరాటరాజు కొలువులో ప్రవేశపెట్టేటప్పుడు 'ఒండు పనులకు సెలవు లేకునికిజేసి యభ్యసించితి శైశవమాదిగాగ, దండలాసకవిధమును గుండలియును, బెక్కణంబు తెరంగును ప్రేరణంబు' అని ఆ వీరుడినోట పలికించాడు. ఈ కవిబ్రహ్మ తన నాటి తోలుబొమ్మలనుంచి ఎన్నో ఉపమానాలు గ్రహించాడు. 'కీలుకా డెడలింప గెడసిన బొమ్మల కైవడిఁ బటుతురంగ ప్రజంబు క్రాలఁ’ (ద్రోణపర్వము - ఆ.3) ‘చలమున దుస్ససేనుడును సౌబలుడున్ మిముబట్టి యార్ప బొమ్మలక్రియ నాడుచుండుదురు మానక నీవు సుయోధనుండు' (ఉద్యోగ పర్వము).
కాకతి గణపతిదేవ చక్రవర్తి బావమరది జాయపసేనాపతి నృత్తరత్నావళి కర్త. ఇతని నృత్తరత్నావళి మధ్యయుగంలో ఆంధ్రులు రచించిన నాట్య గ్రంథాలలో సుప్రసిద్ధమైనది. ఇది అముద్రితము. దీని ప్రతి ఒకటి తంజావూరు సరస్వతీ మహల్ తాళపత్ర గ్రంథాలయములో ఉన్నది. ఈ గ్రంథాన్ని బట్టి గణపతి దేవ చక్రవర్తి సంగీత నాట్య ప్రియుడనీ, కౌమారం నుంచీ ఆయన నాట్యశాస్త్రంలో విశేషకృషి 320 వావిలాల సోమయాజులు సాహిత్యం-4