పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యోరజూపున రాజు నొయ్యన జూచి సమపాదయుతమైన స్థానికస్థితిని దాత్పర్యమున దేవతలకును మ్రొక్కి పుష్పాంజలి యొసంగి పూని నాట్యంబు సమకట్టి నాదంబు సభయెల్ల గ్రమ్మ గైకొలు విడుదలల్ ఘనకళాశైలి కైముడి కట్నముల్ కనుపింప జేసి వెలయంగ దొమ్మిది విధము లైనట్టి భూచారి నాట్యంబు పొందుగా సల్పి పదునారు విధములై పరిగిన యట్టి యా కాశచారియు సమరంగనాడి, గతచారి భేదముల్ కనుపడునట్టు భ్రమణసంయుతదీప్తపటిమ మీరంగ బాణి భేదములను బాటించి చూపి స్థానక సంచయ సంయుక్త మమర బ్రేరణి దేశిని ప్రేంఖణ శుద్ధ దండికా కుండలి తగు బాహుచారి సప్తతాండవములు సల్పె చిత్రముగ...”

అని వర్ణించినాడు. ఇంత విపులంగా నాట్యోపక్రమోపసంహారాలను విశదీకరించిన పట్టు ఆంధ్రసాహిత్యంలో మరొకటి కనిపించటం లేదు. కాకతీయుల కాలంలో ఏకవీరాదేవి జాతరలు జరిగేవి. అందులో జన సామాన్యానందానుభవం కోసం ద్విపద ప్రబంధాలను పాడేవారని వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామంలో -

"ద్రుతతాళంబున వీరగుంఫితకథల్ దుంధుం కిటత్కార సం గతి వాయింపుచు నాంతరాళికయతి గ్రామాభిరామంబుగా యతిగూడన్ ద్విపదప్రబంధమున వీ రానీకముల్ బాడె నొ క్కత ప్రత్యక్షరమున్ గుమారకులు ఫీ ట్కారంబునన్ దూలగన్.”

ఒక కోమలి వీరగాథలు పాడుతూంటే జనం పొంగి పరవశులై పోతూ ఉండేవారని వల్లభరాయుడుసంస్కృతి - 319