బసవపురాణంలో సకలేశ్వర మాదిరాజయ్య కథలోనూ, నాట్యనమిత్తిండి కథలోనూ ఇట్లే మరికొంత విపులముగా గాంధర్వప్రశంస కనిపిస్తున్నది. భక్తులు శ్రీశైల పర్వతారోహణం చేసేటప్పుడు, తుమ్మెద పదములు, ప్రభాత శంకరాదిపదములు పాడుకొంటూ, ఆరభటీవృత్తిలో అంగలు వేస్తూ వెళ్ళేవారని సోమన చెప్పినాడు. ఆ నాటికే యక్షగాన నాటకాలూ, తోలుబొమ్మలాటలూ తెలుగుదేశంలో ప్రసిద్ధంగా ఉన్నట్లు సోమన రచనలవల్ల తెలుస్తున్నది. 'శతకంబు, శివతత్త్వ సారంబు, దీపకళిక, మహానాటకము నుదాహరణములు, రుద్రమహిమయు, ముక్తకామములు, ప్రథమదేశ పురాతనపటుచరిత్రములు, క్రమమొంద బహునాటకము లాడువారు, భారతాదికథల చీరమరుగుల నారంగబొమ్మల నాడించువారు' అన్నవి ఆయన మాటలు. మహాకవి శ్రీనాథుడు, కాకతీయ ప్రథమ ప్రతాపుని సమకాలికుడైన నలగామరాజు పలనాటిని పాలిస్తూ సింహాసనం ఎక్కేటప్పుడు, ఒకానొక నర్తకి వచ్చి నాట్యం చేసిన విధానాన్ని కంటికి కట్టేటట్టు
“ఘనవైభవంబున కామవిభుడు నవ్వుచు సెలవిచ్చె నాట్యంబు సేయ, వరమృదంగము లెస్స వాయించు మేటి కుడిభాగమందున గుదురుగా నిలచె, దాళమానజ్ఞులు దాపటి దిశను నిలచి యుత్సాహంబు నేరుపుమీర, ముఖవీణ వాయించు ముఖ్యుడొక్కండు రాగమాలాపించు రమణు లిద్దరును, నిండు వేడుకతోడ నిలచిరి వెనుక గంజలోచనయును ఘనమైన పాత్ర మదనుపట్టపుదంతి మంజులవాణి ....నిలచి నాట్యమునకు నేర్పరియైన నేత్రపాణికి తన వినయంబు సూపి, అతడొసంగిన గజ్జె లతిభక్తితోడ బాదములం గట్టి, పంచవర్ణముల కాసె గట్టిగ గట్టి కడు జనం బడర మద్దెల తాళాల మధ్య నిలుచుండి వావిలాల సోమయాజులు సాహిత్యం-4