పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కార్తికవాస, ఘోరవాస, త్రిపురవాసాది వాంశికాలనూ, ఆవజము, కాహళము, రుండము, తోలు తప్పటము, తారుమద్దెలలు మొదలైన వాద్యాలను పేర్కొనినాడు.

వీరశైవులు భక్తిరసోన్మాదావస్థకు సాధనంగా సంగీత నృత్యాదులను గ్రహించిన విధానం పురాణంలోని క్రింది పంక్తులవల్ల గోచరిస్తుంది :

"అక్క మహాదేవి! అల్లమద్దెలలు జక్కొల్పి వేగంబ సంధించుకొనుడు; సర్వమానమున బసవ ప్రమథవ్వ! కర మర్థి పట్టుడు కాహళలోలి సకలవ్వ! నీవును సంగళవ్వయును నొకరీతి నిలువుడు సుకరమ్ము గాను, బాలరుద్రమ! ఎత్తుపట్టగ వాళె గ్రోలు వాయింపుము గుడ్డవ్వ! నీవు సట్టన నృత్యంబు సరసం బెరింగి సంగు దాసమ! మహేశ్వరి! వీరభద్ర లింగవ్వ! మీరు కేళికలు సేయుండు; రమణదుకూలాంబరమును గంచుకము నమరించుకొని చల్లడము బిగియించి ఏతెమ్ము! నీవు పురాతమ్మ! శీఘ్ర మాతతమ్ముగ నృత్యమాడుదు గాని; తాళముల్ వట్టుడు, తాళగింపుండు నాళతి వేళకు నందరు ననుచు, నవిరళంబుగ నంత నార్భటం బిచ్చి జవనిక రప్పించి సరసమై నిలచి, పొలపగు ముఖరసంబును సౌష్ఠవమ్ము, లలియు, భావంబు, ధూకళియు, ఝుంకళియును మరియు రేవయు, విభ్రమమును రేఖయును నెరయంగ నీరీతి నృత్యంబు సలుప” (బసవ పురా. పే. 62)