పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెల్లవ అనే నట్టువరాలికి అత్తిలి విషయంలో రెండు ప్రదేశాలను దానం చేసినట్లు అత్తిలి శాసనం వల్ల (Attili C.P. grant 14 of MER 1917-18) తెలుస్తున్నది. అందులో చెల్లవ 'నట్టువరాండ్రనే కలువలకు సూర్యకాంతి' అని వర్ణిత ఐనది. రెండవ అమ్మరాజు (క్రీ.శ. 945-970) ‘కవిగాయక కల్పతరు' బిరుదనాముడు. ఇతని కీర్తిని కవిచక్రవర్తి, పోతన భట్టు అనే ఇద్దరు కవులు గానం చేసినట్లు చరిత్రజ్ఞులు తెలుపుతున్నారు. ఇతడు పట్టవర్ధని కులసంజాతనూ, సంగీత నాట్యశాస్త్రాలలో నిష్ణాత అయిన చామెకాంబను పోషించినట్లు తెలుస్తున్నది. (Kaluchambarru grant in E. I. Vol. VII, PP, 117 – 192) క్రీ.శ. 11వ శతాబ్ద్యాదిలోనే నన్నయ మహాకవి భారతకృత్యాదిన కవిగాయక సమితులకు నమస్కరించాడు. రాజరాజనరేంద్రుని కుమారుడు కులోత్తుంగ చోళదేవుడు మాతామహరాజ్యాన్ని పాలించటానికి పితృరాజ్యాన్ని వదలి దక్షిణానికి వెళ్ళిన తరువాత, నెల్లూరు చోళులు, నతవాడి ప్రభువులు, పొత్తపి చోళులు, కోటవంశీయులు, కాకతీయులు స్వతంత్రించి ఆంధ్రదేశాన్ని భిన్న భిన్న ప్రదేశాలలో ముఖ్యపట్టణాలు ఏర్పరుచుకొని పాలించటం ప్రారంభించారు. తరువాతి కాలంలో కాకతీయులు ప్రముఖులై మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు.

కాకతీయులలో మొదటి ప్రతాపరుద్రుని కాలమునాటికి వీరశైవము ఆంధ్రదేశంలోని విశేష ప్రచారాన్ని పొందింది. వీరశైవభక్తులు పరమేశ్వర సన్నిధానాన్ని పొందటానికి సంగీతనాట్యాలను సహాయకారులుగా స్వీకరించారు. కాకతీయులనాటి సంగీత నాట్యాల స్థితిగతులను తెలుసుకోటానికి పండితారాధ్య చరిత్ర, క్రీడాభిరామము, పల్నాటివీరచరిత్ర ముఖ్యమైన సాహిత్యాధారాలు.

పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రములో ఒకచోట విపులమైన నాట్య ప్రసంగము చేసినాడు. అందులో మార్గ, దేశవిభాగాలను పేర్కొన్నాడు. లాగు, వంజళము, ఢాళము, వళి, తివురు, బాగు, వాహిణి, సాళి ఇత్యాది దేశి భేదములను చెప్పినాడు. గతులలో అడ్డము, తివుటము, సన్న నమిలి, భ్రమర జలచరము, కోతి, గజ, సింహ, భుజంగములనూ, బంధములలో బారణ, దొర్తు, ద్రుక్కరము, మలపము, జల్లణము, బొల్లావణి, జొనాళి మొదలైనవాటినెన్నో ఉటంకించినాడు. వీణోత్తమము, బ్రహ్మవీణ సారంగవీణ, రావణవీణ, గౌణవీణ, కాశ్యపవీణ, భుజంగవీణ, భోజవీణ, త్రిసరణవీణ, సరస్వతీ వీణ, రావణ హస్తవీణ మొదలైన మార్గవీణలనూ, దివిరి, సకిన వళి, విట, సాగరిక, విపంచక, సర, మల్లరి, గోలాష్ఠి, షోషావతి మొదలైన దేశివీణలనూ, జాతివాస, విజాతివాస, పక్షవాస, రుద్రవాస, నిధివాస, ఋషివాస,316 వావిలాల సోమయాజులు సాహిత్యం-4