లక్షణాలను పరిశీలించినప్పుడు దేశంలో సంగీత నాట్యాలు అత్యుత్తమ స్థితిని పొందినవని చెప్పవలసి వస్తుంది. పూర్వోక్తాలైన బౌద్ధ క్షేత్రాలలోని శిల్పఖండాలను పరిశీలించినప్పుడు, ఈ అభిప్రాయం దృఢ మౌతుంది. ఆలీఢ ప్రత్యాలీఢాది పాదవిన్యాసాలూ, పతాకాది ముద్రలూ, కోమల కరణాంగహారాలూ వాటిలో శిల్పితాలైనవి. జంత్ర, చర్మ వాంశికాది వాద్యాలతో ఆ నాటి ఆంధ్రులకు పరిచయమున్నట్లు స్పష్టమౌతుంది. వేయితీగలు గల 'గెయిటర్'ను పోలిన ఒక నాద్యవిశేషశిల్పం ఒకటి అమరావతి స్తూప చిత్రాలలో కనిపిస్తున్నది. సాతవాహన రాజులనాటి సంగీత నాట్యాలనూ, శాస్త్ర విస్తృతిని స్మరించటానికి శిల్పఖండాలు తప్ప మరొక ఆధారం ఏమీ కనిపించటం లేదు.
సాతవాహన రాజుల తరువాత ఆంధ్రదేశాన్ని, ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు మొదలైన ఆంధ్రభృత్యులు పరిపాలించారు. శాతవాహన రాజులు చేతికిచ్చిన కళాసంపత్తిని వ్యర్థం చేయకుండా వన్నెలు చిన్నెలు దిద్దుకుంటూ, పూర్వ ప్రభుమార్గాన్ని అనుసరించి పోషించారు, ఈ రాజవంశాలలో జన్మించిన ప్రభువులు. మాధ్యమిక బౌద్ధవాదానికి పట్టుగొమ్మ అయిన నాగార్జునాచార్యుడు ఇక్ష్వాకు వంశ మూలపురుషుడు - శాంతిమూలుని సమకాలికుడని చరిత్రజ్ఞుల అభిప్రాయము. ఇది సత్యమైనట్లైతే ఆ మహావిజ్ఞాని వ్రాసిన సంగీతశాస్త్రం ఏ టిబెత్తు భాషలో నుంచో బయట పడినప్పుడు ప్రాచీనాంధ్ర సంగీత విద్యావిశేషాలు మరికొన్ని బయటపడవచ్చును. నాగార్జున కొండ శిల్పాలలో కొన్ని ఖండాలను పరిశీలించినప్పుడు ఆ నాటి సంగీత నాట్యాలను గురించి కొంత ఊహాగానం చెయ్యటానికి అవకాశం ఉంటుంది.
సాతవాహన రాజ్యపతనానంతరం ఇక్ష్వాకులతో పల్లవులు కూడా ఆంధ్ర దేశంలో కొంత భాగాన్ని పాలించారు. వీరు పశ్చిమం నుంచి చాళుక్యరాజు రెండవ పులకేశి వచ్చి దక్షిణానికి తరిమివేసేటంతవరకూ దేశాన్ని పాలించి, సంగీత నాట్యాలకు దోహదమిచ్చారు. పల్లవ మహేంద్రవిక్రముడు దక్షిణానికి వెళ్ళిపోయేటప్పుడు అనేక కవిగాయక శిల్పి వర్గాలను ఆంధ్రదేశం నుంచి ఆయనవెంట తీసుకొని వెళ్ళినాడు. వారిలో సుప్రసిద్ధుడు మేధావి రుద్రుడనే నామాంతరమున్న రుద్రాచార్యులు. ఈ మహానుభావుడు తన కాలంలో ఉన్న తానాలను సరిదిద్ది నిబంధిస్తే, ప్రభువు మహేంద్రవర్మ ‘కుడిమియ మలై' అనేచోట శాసనస్థం చేయించాడు శిలాస్తంభాలమీద. ఇక్ష్వాకుల పతనానంతరం ఆంధ్రదేశం విష్ణుకుండినుల హస్తగతమైంది. ఉండవల్లిగుహలు వీరు తొలిపించినవేనని శ్రీ భావరాజు కృష్ణరావు314 వావిలాల సోమయాజులు సాహిత్యం-4