సంగీత నాట్యాలకు సంబంధించిన సూత్రాలు వ్రాసినాడు. ఆయన విద్యా సముద్దేశంలోని నాగరవృత్తంలో నాగరకులు యక్షరాత్రి, సువసంతక, మదనోత్సవాది గోష్ఠులు జరుపలెననినాడు. వీటిలోని సువసంతక, మదనోత్సవములు, కేవలము నృత్యగీతవాద్య ప్రాయాలైనవని కామసూత్ర వ్యాఖ్యాత జయమంగళుడు 'సువసంతో మదనోత్సవ, తత్ర నృత్తగీతివాద్య ప్రాయః' (1-4-42) అని వ్యాఖ్యానించినాడు. 'పక్షస్య మాపక్షస్యవా ప్రజ్ఞాతే హని సరస్వత్యా భవనే నియుక్తానాం నిత్యసమాజః, కుశీల వాశ్చాగంతుకాః ప్రేక్షణకమేషాం దద్యుః, ద్వితీయే-హని తేభ్యః పూజానియతం లభేరయన్, తతో యథాశ్రద్ధ మేషాం దర్శన ముత్సర్గోవా. ఆగంతుకానాం చ కృతిసమవాయానాం పూజన మభ్యుపపత్తి శ్చేతి గణధర్మః' (161-165) మొదలైన మూల సూత్రాలలో మహర్షి వాత్స్యాయనుడు 'ప్రఖ్యాతమైన పండుగదినాల్లో నగరానికి వచ్చే నటులూ, సంగీతజ్ఞులూ, మొదటిదినం సమస్త ప్రదర్శనాలో పాల్గొని, మూడవ దినం క్లిష్టదానం అవుతుంది. కనుక రెండవ దినమే వారి కోసం ఏర్పాటైన ప్రేక్షక మూల్యంలోనుంచి కొంత ధనాన్ని బహుమానంగా పుచ్చుకోలవసిందనీ, దానికి ఇష్టంలేని సందర్భంలో ప్రేమ పూర్వకంగా నాగరకులు ఇచ్చిన వస్త్రాభరణాలతో తృప్తిపొంది జరిగిన నాటక ప్రదర్శనాన్ని ప్రేక్షకులు తిరిగి కోరినట్లయితే ప్రదర్శించవలసిందనీ, నగరాలలో ఉండే కుశీలవులకూ, నాగరకులకూ, పరిషత్తులకూ ఆగంతుకులుగా వచ్చిన నటగాయకాది కళాభిజ్ఞులను గౌరవించడం ధర్మ' మనీ శాసించినాడు. దీనినిబట్టి క్రీస్తు పూర్వమే ఆంధ్రజాతి సంగీత నాట్యాది కళాభిజ్ఞత సంపాదించి కట్టుబాట్లతో వాటిని పోషించుకున్నదని వ్యక్తమౌతుంది. అంతకు ఎంతో పూర్వమే భారతదేశంలోని సమస్త ప్రాంతాలలోనూ స్త్రీ పురుష నాటక సంఘాలు ఉన్నట్లు వాల్మీకి మహర్షి రామాయణంలోని 'న రాజకే జనపదే ప్రభూత నటనర్తకాః, ఉత్సవాశ్చ సమాజాశ్చ వర్ధంతే రాష్ట్ర వర్ధనాః' ఇత్యాది అభిభాషణాలవల్ల తెలుస్తూనే ఉన్నది. మహర్షి శయనోపచారికాలలోనూ, చతుష్షష్టినిరూపణములోను వైశికమునను మరికొన్ని సూత్రాలు వ్రాసినాడు, ఆ నాడు ఉదక వాద్యములు భాండనృత్యములు నున్నట్లు తెలియుచున్నది. హాల మహారాజు నాటిదని చెప్పదగ్గ కౌముదీ మహోత్సవ నాటకంలో మరికొన్ని సంగీత నాట్య ప్రశంసలు కనిపిస్తున్నవి. హాల మహారాజు అనంతరం సాతవాహన రాజులలో గౌతమీ పుత్ర, వాసిష్ఠీ పుత్రులు ప్రసిద్ధి కెక్కిన రాజన్యులు. వీరు ధాన్యకటకము రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించి అమరావతి, రామిరెడ్డిపల్లి, గుంటుపల్లి, గోలీ, బుద్దాం, సమాధానపురం, మంచికల్లు మొదలైన అనేక ప్రదేశాలలో బౌద్ధక్షేత్ర నిర్మాణానికి కారణభూతులై అనేక యజ్ఞయాగాదిక్రతువు లొనర్చి పూర్వరాజన్యప్రశస్తి పొందినవారు. పైన చెప్పిన యజ్ఞ యాగాది క్రతుసంస్కృతి 313
పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/313
Appearance