Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూజ చేస్తారు. ఈ విధంగా చవితినాడూ, చైత్రశుద్ధ చవితి నాడూ విఘ్నేశ్వర పూజ చేయటం పైన ఉదహరించిన ఋగ్వేద మంత్రాన్ని అనుసరించి వైదికాచారాలే. మన పంచాంగాల్లో మాఘశుద్ధ చవితి గణేశ పూజ అని వ్రాసి ఉంటుంది. చైత్రశుద్ధ చవితినాడు విఘ్నేశ నక్షత్రదర్శనం అయినా, ఆయన మాఘశుద్ధ చవితినాడే ఉదయించటం వల్లనే ఆ నాడు గణేశ పూజ అయింది. ఇందువల్లనే సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు స్వామికణ్ణు పిళ్లై గణేశ చతుర్థి మాఘశుద్ధ చవితి అని నిర్ణయించినారు.

విఘ్నేశ్వరునికి సంబంధించిన గజముఖ, శమంతకోపాఖ్యానాలను జ్యోతిష శాస్త్రజ్ఞులు ఖగోళ శాస్త్రరీత్యా సమన్వయం చేసినారు.

గజాసురుడు ఘోరమైన తపస్సు చేసి లోక కంటకుడైన సందర్భములో విష్ణువు మాయానర్తకుని వేషంలో వచ్చి బ్రహ్మ, నంది, నారదుల సహాయంతో నాట్యం అతణ్ణి ప్రాణమివ్వమని కోరినాడు. అతడు అంగీకరించి శివునికీ తనకూ నిత్యసాన్నిధ్యం కోరుకున్నాడు. ఆ కారణం చేత నంది వెళ్ళి గజసంహారం చేసి అతని శిరస్సును తెచ్చి పార్వతిచేసిన పిండిబొమ్మకు అతికించినాడు. గజాసురుడు కోరినట్లు అతని ముఖానికి ప్రథమపూజ ఆ నాటినుంచీ జరుగుతూ వున్నది. విఘ్నేశ్వరుడు గజముఖుడైనాడు. ఇది పురాణ కథనం. దీనిని ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ క్రిందివిధంగా సమన్వయిస్తున్నారు.

'అర్ద్ర' రుద్రుడు. అశ్వని, భరణి కృత్తికా నక్షత్రాలు నాగవీథి; రోహిణి, మృగశిర, ఆర్ద్ర నక్షత్రములు కుజవీథి, ఈశ్వరుడు గజవీధిలో ఇరుకు కోవలసి వచ్చినది. వృషభరాశి నంది, వృషభము గజుని చంపినది, వృషభము అర్ధను మిథునముతో జేర్చుటకు తోడ్పడినది. ఇంతకుముందు గజుని మూలముగా వేరైనా పార్వతీ పరమేశ్వరులు మరల నొకటైనారు.

“మఖ, పుబ్బ, ఉత్తర 1/4, సింహరాశి, సప్తర్షి మండలం జ్యోతిష శాస్త్రంలో బృహదక్షమని పిలువబడుతున్నది. అందే జాంబవంతుడు, సప్తర్షులలోని వాడు పడమటి చుక్కలు రెండూ ఇట మఖ సింహమును, ఆట ధ్రువుని (URSA - MINOR - చిన్న ఎలుగుబంటు) జూపుచున్నవి.' దీని ననుసరించి ఏర్పడ్డదే శమంతకోపాఖ్యాన కథ. విష్ణుపురాణంలో జాంబవంతుని కుమారుని దాది 'సింహః' ప్రసేన మవధీత్సింహా జాంబవతాహతః, సుకుమారక మారోదీస్తవ హ్యేష శ్యమంతకః" అని చెప్పింది. విఘ్నేశ్వరుడు చవితినాడు హస్తానక్షత్రంలో కలిసి వుంటాడు. అందువల్ల హస్తి (గజము) హస్తకూ ఏమైనా సంబంధం ఉండి వుంటుందా అని శ్రీ గొబ్బూరి వెంకట