ఆనందరాఘవరావుగారు ఊహించినారు. వేదములో 'హస్తానక్షత్రం సవితాదేవతా' అని ఉందట! సత్రాజిత్తు సూర్యుణ్ణి ఆరాధించి శమంతక మణిని సంపాదించినట్లు ఉన్న కథకూ, దీనికీ ఏమైనా సంబంధం ఉంటుందా?
ఆచార్య శంకరుల తరువాత సూర్య, శివ, శక్తి, సుబ్రహ్మణ్య, గణేశ, విష్ణు సంప్రదాయాలు వచ్చినవి. వీరిలో గాణాపత్యులు గణపతిని శివునికంటే అధికునిగా భావించి ఆయనకు పంచముఖాలు, త్రినయనాలూ కొన్ని సందర్భాల్లో కల్పించినారు. వినాయకుణ్ణి వారు శివుని ఆకాశ శక్తిగా భావించినారు. అనంతాకాశాన్ని వ్యక్తం చేయటానికి బహుళ గోళాలను మోదక రూపాలుగా భావించి ఆయన కడుపును అంత విశాలమైనదానినిగా ఊహించి ఉంటారా? అనంతానందగిరి, గాణాపత్యులలో ఆరు సంప్రదాయాలున్నట్లు పేర్కొన్నాడు. వారిలో ప్రథములు మహాగణపత్యుపాసకులు. ఈ సంప్రదాయానుయాయులు వామ మార్గాన్ని అనుసరించి అశ్లీలమైన గణపతిమూర్తిని ఆరాధిస్తారట. నవనీత, సంతాన, స్వర్ణ గణపతులను ఉపాసించేవారు శ్రాతవిధులను అనుసరిస్తారట. గాణాపత్యుల మతంలో కార్యారంభాల్లో గణపతిని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లు 'ఓం లం నమస్తే గణపతయే త్వ మేవ ప్రత్యక్షం, తత్త్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్మాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ కేవలం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యమ్” ఇత్యాది వాక్యాలవల్ల గాణాపత్యులు గణపతిని వసు, రుద్ర, ఆదిత్య రూపుడైన పరమాత్మనుగా భావించారనటం నిస్సందేహము. అందువల్ల ఆయన అవతారమూర్తులను కొన్నిటిని కల్పించి ఈ దేశంలో కొన్ని కథలు కూడా వ్యాప్తిలోకి వచ్చినవి. అటువంటి కథలు దక్షిణ దేశంలో చిన్న పిల్లలకోసం మురుగేశ మొదలియారు వ్రాసినాడు. ఈ కథలో ముఖ్యంగా గమనింపదగ్గ అంశం కంసునికీ కృష్ణునికీ ఉన్న సంబంధం వంటిది, గణేశుడికీ, సింధువనే రాక్షసుడికీ, ఉండటం, ఈ కథల్లో ప్రళయ కాలానంతరం పునఃసృష్టికి పూర్వం గణపతి వటపత్రశాయిగా ఉండటమూ గమనింపదగ్గది. 10
"త్వం బ్రహ్మత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వ మింద్రస్త్వ మగ్నిస్త్వం | వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మా భూర్భువరాప ఓమ్ || " - గణపత్యుపనిషత్తు