గజాననుడు, వికటుడు - అతని అనుచరులు. గణకర్షి రూపాన్ని అనుసరించి గణపతికి నేటి దేవతామూర్తి వచ్చి ఉంటుందని కొందరూహిస్తున్నారు.,
మహాగణేశ్వరుని మహామంత్రం 'ఓం, హ్రీం, శ్రీం, క్లీం, క్లైం, గ్లెం, గం, గణపతయే వరవరదసర్వ జనం మే వశమానయ స్వాహా' - అని. ఇందులో ముఖ్యమైన అక్షరాలు ఇరువది ఒకటి మాత్రము, అందువల్ల గణపతికి ఇరువది యొకటి ముఖ్యమైన సంఖ్య. అన్ని పత్రులు, అన్ని కుడుములు పెట్టటము మనకు లక్షణము.
మహాగణేశుని రూపాన్ని గురించి వ్రాస్తూ ఒక అభిజ్ఞుడు ఇలా వ్రాసినాడు. 'Mahaganesa is a fanciful figure better imagined than modelled. A Sea of cane juice which naturally attracts bees and wasps; and the elephant headed God has to perpetually fan them with his broad flapping elephant ears, for he has the head of an elephant with three eyes. An elephant rutting and as such Mahaganesa has his spouse Paducakara seated on his left thigh and embracing an amorous bejewelled Ganesa : a Veritable NOU VEAUX riches. ⁹6
కొన్ని గ్రంథాలు మహాగణేశుని హేరంబుని ఒకే దేవతామూర్తిగా భావించినవి. హేరంబశబ్దాన్ని 'హః : శంకరః హేతతే సమీపే రమతే తిష్యతా' అని సాధింపవచ్చును. హేరంబుడు బంగారువర్ణము కలవాడు. త్రినయనుడు. సింహవాహనుడు. ఆయన హస్తాలలో ఒకటి అభయహస్తము. ఒక కొమ్ము, గొడ్డలి, జపమాల, గద, అంకుశము, త్రిశూలము ఆయన ఆయుధాలు. విఘ్న, వినాయక, శూర, వీర, వరద, ఇభవక్త్ర, ఏకదంతులు ఇతని పరిచారకులు. ఇతనికి బీజాక్షరం 'గం.' ముద్గల పురాణంలో హేరంబుని గురించిన రూపవర్ణనాదులు విశదంగా కనిపిస్తున్నవి. ఆయన గజతుండము సూటిగా నుండి కుడికిగాని ఎడమకుగాని తిరిగి ఉండటం మరొక శిల్పశాస్త్ర లక్షణము. ఈయనను పంచముఖ వినాయకుడని కూడా శిల్పరత్నము, ముద్గల పురాణము వ్యవహరించినవి. మనదేశంలో తిరుముద్రియూరు దేవాలయంలో పంచముఖ వినాయకుని శిలావిగ్రహం ఒకటి అతి సుందరశిల్పం కనిపిస్తున్నది. ఆ విగ్రహానికి ఉన్న పంచ శీర్షాలమీదను కారండమకుటాలు ఉన్నవి. సర్వసామాన్యంగా ఉండవలసిన యజ్ఞోపవీతం కనుపించదు.
హరిద్రాగణపతికి బీజాక్షరం గ్లం. గాయత్రి ఛందము. చోరగణేశుడు మంత్రజప సందర్భాలలో తప్పిదం చేయకుండా ఉండటానికి ఏర్పడ్డ దేవత. 'గణేశవిమర్శిని' అనే గ్రంథంలో చోరగణేశ మంత్రం 'న జప్త్వా కర్మ మాత్రం న కుర్యాత్, యది కుర్యాత్ తదా దోష ఉక్తో వర్ణవిలాస తంత్ర' అని ఉంది. ఇతని మంత్రం గ్లాం.