సిద్ధి వినాయకుణ్ణి గురించి మహాభారతంలో ధర్మరాజుకు కృష్ణభగవానుడు ఇలా చెప్పినట్లుంది. యుద్ధసన్నద్ధులై కురుక్షేత్రంలో కౌరవ పాండవులు నిలచినప్పుడు 'ఏ దేవత మనకు సిద్ధిని చేకూరుస్తాడు?' అని యుధిష్ఠిరుడు కృష్ణ భగవానున్ని ప్రశ్నిస్తే, ఆయన సిద్ధి గణేశుని నామాన్ని ఉచ్చరించి ఆయనను పూజింపవలసిన విధానాన్ని విపులంగా పేర్కొన్నాడు. ఆయనకు ఇరువది ఒక్క పత్రి, దూర్వాంకురాలూ ఇష్టమని చెప్పినాడు. బంగారు గణేశ విగ్రహాన్ని బ్రాహ్మణునికి దానం చెయ్యవలెననీ, సమస్త దేవతాపూజకు ముందూ సిద్ధివిఘ్నేశ్వర పూజ జరిగించాలనీ, గణేశపూజ వల్ల చండికామాతృశ్రీ సంతోషిస్తుందనీ, భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణేశపూజ చేస్తే దానికి కైలాసంలో దేవతలందరూ సంతోషిస్తారనీ, పరాశర మహర్షి శాపకారణంగా ఆ పండుగనాడు చంద్రుని చూడగూడదనీ ఆ భారత భాగం వల్లనే కృష్ణ భగవానుడు ధర్మరాజు కుపదేశించినట్లు తెలుస్తున్నది. ఒకవేళ పొరబాటున ఆ నాడు ఎవరైనా చంద్రుణ్ణి చూడటం సంభవిస్తే "సింహప్రసేన మవధి త్సింహే జాంబవంత హంతః” అని అనవలెననీ, దానికి మూలకారణమైన శమంతకమణి కథనాన్ని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పినట్లు స్కాందపురాణంలో ఉంది.
యాస్కాచార్యులవారు 'గణ' శబ్దాన్ని వాక్కుకు ముప్పదియెనిమిదవ నామంగా లెక్కపెట్టి నారు. ముప్పదియవ నామము ఘోషము. స్కంద స్వామి దానికి "ఉచ్యతే యితి వాక్. ఇంద్రియమ్, తత్కార్యః శబ్దాప్యుచ్యతే ఇతి వాక్ తదధిష్ఠాత్యపి దేవతా వా గణిష్యతే" అని వ్యాఖ్యానించినాడు. క్షీరస్వామి "గణః గణనాత్ సహి గణ్యతే వసుసంయోగాత్ గుణశ్చ గుణాపి గణనాదేవ, అసావహిహి గణ్యత ఏవ - ద్విగుణః, త్రిగుణః" అనినాడు., అందువల్ల గణపతి అష్టోత్తర శతాలలో నాగధిష్ఠాన దైవతము, శబ్దగమ్యుడు అయినాడు.
గణపతి గణేశ మంత్రానికి ప్రధాన బీజాక్షరం 'గం' దీని శక్తులు 1. తీవ్ర (ధా) తీవ్ వ్యాపించు, అనంతమైన, తీక్షమైన, 2. జ్వాలినీ - మండు: 3. నందా: సౌఖ్యము, సమృద్ధి 4. భోగదా : సౌఖ్యానుభవము, సంపద (ధా. ఘుజ్) 5. కామరూపిణీ 6. ఉగ్ర 'గణ'కు శక్తిగా ఉన్న ఉచ్ నుంచి వచ్చినది. 7. తేజవతీ 8. సత్య 9. విఘ్ననాశినీ గణేశమంత్ర ద్రష్టను తంత్రగ్రంథాలు 'గణకర్షి' (Calculator) అని పేర్కొన్నవి. అతడు కుంకుమ వంటినాడు. త్రినయనుడు. కుండబొజ్జవాడు. చేత ఒక దంతాన్ని ధరించి ఉంటాడు. ఒక అంకుశము ధరించి ఉంటాడు. ఈ వర్ణనంతా ఆ తంత్రాలలోనే కనిపిస్తున్నది. వక్రతుండుడు, ఏకదంతుడు, లంబోదరుడు, మహోదరుడు,