మాసంలో వచ్చే పంటదేవతగా (Harvest god) నిరూపించటానికి యత్నించారు. ఈ విషయాన్నీ గుప్తే మహాశయుడు ఆయన హిందువుల పండుగలు అనే గ్రంథంలో ఇలా వ్రాసినాడు.
"Philologists and Ethnographists have tried to trace the origin of Ganesh to the Harvest season, comparing Parvati to the earth, and the clay of which the figure was made, to the alluvial crust found on the banks of the rivers soon after the Bhadra pada crop. Some derive his origin from the letter 'Om' but a recent examination of the signs of the zodiac discloses the origin of the belly, from the big body of the crab, or Cancer (Karkataka) which stands in heaven just near SHIVA, who as the male part of the GEMINI (Mithuna) intervenes between the female part of that sign (Parvati) and the Zodaical sign of Cancer or the crab of big belly."*
గణాధిపతి ప్రధాన లక్షణాలను అనుసరించి పైరీతిగా ఆయనను భాద్రపదమాసంలోని పంటదేవతగా భావించటానికి అవకాశం ఉంది. పైరీతిగా భావించిన వారు ఆయన మూషకవాహన లక్షణాన్ని కూడా సమన్వయించారు. మూషకశబ్దం (ముష్) ధాతువువల్ల జనిస్తున్నది. పంటపొలంలో ఉండే దొంగ ఎలుకలను పట్టుకోడానికి పంటదేవత అయిన విఘ్నేశ్వరుడు మూషకవాహనుడు కావలసివచ్చిందని వారు భావించారు. ఆయన గజాననము బహుశః కర్షకుని రూపం నుంచి వచ్చి ఉండవచ్చునని వారి అభిప్రాయం. కర్షకుడు, తలమీద కోసిన ధాన్యాన్ని మోసుకొని వస్తుంటే వేలాడే చివరలను చూచినవానికి ప్రథమంలో గజాననుని రూపం గోచరించి ఉంటుందనీ, దానిని అందరూ అంగీకరించి ఉంటారని వారన్నారు. ఆధిక్యమును ఏనుగుతో పోల్చటం కద్దు. అందువల్ల అధికమైన పంటను తెలియజేసే దేవతతో గజసంబంధాన్ని కల్పించి ఉంటారని కొందరు ఊహించారు. ఆయన లంబోదరత్వము పంటను దాచి ఉంచే గాదెలను సూచించవచ్చునని వారిలో మరికొందరు అభిప్రాయ పడ్డారు. కాళియదమనుడు విజయసూచకంగా ఫణి ఫణాగ్రాలమీద నృత్యం చేసినట్లు, తాను ఎలుకలబారినుండి రక్షించిన పంటను చూచి, మిమ్మల్ని నేను జయించాను చూచారా, అన్న విజయ భావాన్ని సూచించటానికే పూర్వులు ఈ పంట దేవతకు మూషక వాహనాన్ని కల్పించి ఉంటారని కొందరన్నారు.
గణేశుని ఏకదంత శూర్పకర్ణాలకు కూడా వారిలో కొందరు ఇటువంటి ఊహలు చేయకపోలేదు. ఆయన ఏకదంతము నాగలి, శూర్పములు నూతన ఫలసాయానికి