ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అభిప్రాయమే ఇటువంటిదైనట్లు రాసినాడు. ఫావిడా జాతిలోని పెళ్ళి కుమారుడి పక్షం ఏబది నాణాలు పంపితే వాటికి బదులుగా పెళ్లి కుమార్తె వారు ఐదు పందులను పంపుతారట! అప్పుడు పెళ్ళి కుమార్తె తండ్రి పెళ్ళి కుమారుడి తండ్రికి 'మీ నాణాలకు మీకు వచ్చేది ఈ ఐదు పందులు గాని అందమైన మా అమ్మాయి కాదు' అని చెప్పి పంపుతారట. ఇటువంటి సందర్భాలలో ఇవి లాంఛనాలు. పరస్పరమూ సఖ్య భావాన్ని పెంపొందించే క్రియలేగాని ఆసుర వివాహ లక్షణాలుగా ఆధునిక వివాహంలో నిలిచిన లక్షణాలు మాత్రం కావు.
(ఆంధ్రపత్రిక 1948 డిసెంబర్ 15)
÷