క్రమగౌరవం కలుగుతుందనీ, అది వారికి గౌరవ విషయమని భావిస్తున్నారు. కొన్ని జాతుల్లో ఆమెకోసం వ్యయమయ్యే ధనాధిక్యమును బట్టి భార్యకు గౌరవం లభిస్తున్నది.
'కన్యాశుల్కం' కోసం కొంతధనం వ్యయం చేయకుండా లభించిన భార్యను వెలివేసిన వ్యక్తివలె భావించటం యాకూట్ జాతి వారి అభిప్రాయం. యద్విధమైన శుల్కమును ఆ జాతి స్త్రీలు అగౌరవంగా చూస్తారట. క్రమమైన వెలయిచ్చి కొనుక్కోని భార్యను జారిణిగా పరిగణించటం పశ్చిమాఫ్రికా జాతుల ఆచారం. ప్రియుడు 'శుల్కం' చెల్లించలేని స్థితిలో, కొన్ని జాతుల్లో ప్రియ అతనితో కలిసి తండ్రి యింట్లోనుంచి పారిపోతుంది. అప్పుడు తప్ప ఆమె మనసారా ప్రేమించిన ప్రియుణ్ణి వివాహం చేసుకోటానికి అవకాశముండదన్న మాట. అందువల్ల కొన్ని జాతుల్లో ఈ శుల్కాన్ని తప్పించుకోటానికి యువతీయువకులు పారిపోవటం (Elopement) జరుగుతుంటుంది. అటువంటి వరుణ్ణి వధూజాతివారు దొంగసొత్తుతో ఉన్న వాడివలెనే చూస్తారు.
భార్యకు ప్రతిగా ఇచ్చే ఈ 'శుల్కం' జాతుల్నిబట్టి మారుతుంటుంది. మక్కాలో కన్యకలను భార్యలుగా ఉత్తమ తరగతులవారే అమ్ముతుంటారని ఫీల్డింగు అతని 'విచిత్రాచారాలు' అనే గ్రంథంలో వ్రాశాడు. చాలా దేశాలలో ఇది బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది. దానికి ప్రతిగా వరుడు కొంత కట్నమూ పొందవచ్చు. ఆంధ్రదేశంలో పెట్టే సొమ్ముకూ అల్లుడికిచ్చే కట్నానికి అధిక సంబంధం నేటికీ కనిపిస్తూ ఉన్నది.
ఉత్తర అమెరికాలోని ఇండియను జాతుల్లో అందమైన వధువుకు 'శుల్కం' పన్నెండు పోనీ జంతువులు. అక్కడి కాలిఫోర్నియాలోని హూఫా జాతిలో వధువుకు ఇచ్చే శుల్కం వరుని తండ్రి తల్లిని వివాహమాడేటప్పుడు ఇచ్చిన 'పణ్యధనం' మీద ఆధారపడి ఉంటుంది. ఆఫ్రికా జాతుల్లో భార్యను కొనుగోలు చెయ్యటం విపరీతం. పణ్యధనం ఆహారవస్తువులు, గొంగళులు, కత్తులు మొదలైన వస్తు సామగ్రి ఏదైనా కావచ్చును. జాతి పెద్ద భార్యను కొనటానికి నూరు పశువుల నిస్తాడు. ఉగాండాజాతుల్లో ఉత్తమ తరగతివారు భార్యకోసం నూరు మేకలనూ, పదహారు ఆవులనూ క్రయధనంగా ఇవ్వవలసి ఉంటుంది. పేదవాడు మూడు నాలుగు ఎద్దులనూ అయిదు ఆరు సూదులు ఇస్తే భార్య దొరుకుతుంది. బంగలాజాతిలో నరధనం తప్ప పుచ్చుకోరు. ఆ జాతిలో భార్య కావలిస్తే ఇద్దరు ఆడబానిసలనూ, ఇద్దరు మగబానిసలనూ స్వతంత్రుడైనవాడు ఇవ్వలసి ఉంటుంది. ఆఫ్రికా జాతుల్లో సర్వసామాన్యంగా పశువులకూ కన్యకలకూ మారకం జరుగుతుంది. పది పన్నెండు పశువులను ఇస్తే కాఫిర్కు భార్య లభించటం
సంస్కృతి
267