పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేకుండా జరుగుతున్నది. ఇది కేవలమూ దూషణము, బలాత్కారము, ఆచారము, కాదు. ఈ విభేదాన్ని గమనించవలసి ఉంది. ఈ రాక్షస వివాహ లక్షణం ఉన్నచోట పూర్వాచారమూ, సంజ్ఞాత్మకంగా బలాత్కారం జరిగినప్పుడు కన్యక చూపించే దుఃఖం విశేషంగా కృతకమూ, పరంపరాగతమూ, నీతి నిరూపణాత్మకము. కేవల దూషణ వివాహాల్లో దుఃఖము సత్యము. ఇటువంటి వివాహాలు విశేషంగా అనాగరక జాతుల్లో కనిపిస్తున్నా సర్వసామాన్యము కాదని గాడ్సీ అభిప్రాయం. అనాగరిక జాతులు ప్రక్క జాతులతో వైరం పెట్టుకోటానికి ఇష్టపడకపోవటమే దీనికి ఆయన చూపించే ప్రబల కారణము. ఇది వారికి సర్వ సామాన్య ధర్మము కావటం వల్ల వారు ఈ విషయాన్ని గురించి సత్యమైన యుద్ధాలకు పూనుకోరనీ, వారి మైత్రి దీనివల్ల నశించదనీ ఇతరులు అతని అభిప్రాయాన్ని అంగీకరించారు.

(ఆంధ్రపత్రిక, 1948 డిసెంబర్ 1)


265

సంస్కృతి