పురాతన గ్రీసుదేశంలో - ప్రధానంగా స్పార్టాలో, ఈ రాక్షస వివాహ లక్షణం వారి వివాహపుతంతులో నిలచిపోయింది. ఫ్లూటార్కు మహాశయుడు 'లికుర్గన్ జీవితంలో దీని స్వరూపాన్ని క్రింది విధంగా నిరూపించాడు.
"In their marriages the bride-groom carried off the bride by violence, and she was never chosen in a tender age, but when she arrived at full maturity. Then the woman that had the direction of the wedding cut the bride's hair close to the skin, dressed her in man's clothes laid her upon a mattress, and left her in the dark. The bridegroom went in privately, untied her girdle, and carried her to another bed....” (Strange Customs of Courtship and Marriage - W. Fielding P. 251)
ఉత్తమ జాతులలోని వివాహాల్లోనూ ఈ లక్షణం అల్పమాత్రంగానైనా నేడు కనిపిస్తూ ఉన్నది. భారతదేశమూ, చైనా, జావా, ఈజిప్టు దేశాలలోనూ, యూరప్ దేశంలోనూ దీనికి సంబంధించిన ఒక తంతు కన్యక గిరి లేక కంచె తొక్కకుండా ఇంట్లో ప్రవేశించటము అనే ఆచారం కనిపిస్తున్నది.
ఈ రీతిగా నేటికీ నిజరూపాన్ని సంజ్ఞాత్మకంగానైనా నిలుపుకున్న రాక్షస వివాహం, వైవాహిక పరిణామంలో ఒకానొక దశను నిరూపిస్తూ ఉన్నది. దీనిని కొందరు ‘మహద్దూషణము' (Glorified Rape) అన్నారు. మనలో అతి ప్రశాంతంగా నడిచిపోతూ ఉన్న వైవాహిక విధానాలను ఏ రీతిగా గమనిస్తున్నామో, ఈ వివాహ విధానం ఆచరణలో ఉన్న జాతులవారు దీనిని అదేరీతిగా చూస్తున్నారు. కూటాంతరము అంగీకరించని జాతులకు ‘బాహ్యరక్తస్పర్శ' (Touch of Exogamous blood) దీనివల్ల కలుగుతున్నది. అందుమూలంగా జాతుల్లో నూతనరక్తం ప్రవేశిస్తున్నది. జాతి రక్తము గడ్డకట్టి పోవటమనే చెడు నేడు తప్పిపోతున్నది. ఈ దృష్టితో ఇటువంటి రాక్షస వివాహాలకు పూనుకున్న జాతివారు బలాత్కరించి తెచ్చిన స్త్రీలను వారి జాతి స్త్రీలకు పెంపుడు కుమార్తెలనుగా పరిశీలించి, యథావిధిగా వివాహం చేసినప్పుడు భార్యలుగా స్వీకరిస్తారు. ఈ పని ముఖ్యంగా మాతృస్వామిక కూటములో (Matriarchical Genus) జరుగుతుంది.
మెక్లినన్ అనే సాంఘిక శాస్త్రవేత్త సంజ్ఞాత్మకంగా నేటి వివాహాలలో రాక్షస వివాహ లక్షణం నిలబడి ఉండటము గొప్ప విశేషమనినాడు. ఉభయ పక్షాలలో వివాహానికి అంగీకారం ఉన్నప్పుడు వరుడు స్నేహితబృందంతో కన్యను బలాత్కరించటం కేవలమూ పూర్వాచారము. కొన్ని జాతుల్లో పూర్వము అంగీకారం
264
వావిలాల సోమయాజులు సాహిత్యం-4