ప్రశ్నిస్తాడు. 'మా గుడిసెలో నివసించటానికి యుద్ధం చేయవలసిందే' అని అంటాడు. యుద్ధం సాగగానే అతను లొంగిపోతాడు. వరుని పక్షంవారు ఇంట్లో ప్రవేశిస్తారు. ఆ జాతిలో వధువు పారిపోతే పట్టుకొని పోవడం కూడా ఇటువంటిదే.
ఆ నాడు ఆచారంగా ఉన్న ఈ వివాహాలు నేడు ఇటలీ దేశస్థుల వివాహంలోని ఒక తంతులో ఇమిడి, పోలండు దేశంలో ఇటువంటి ఆచారం ఉంది. ఐర్లండు వివాహంలోనూ ఇవే కల్పిత యుద్ధాలు (Mock - fight) కనిపిస్తాయి.
ఆర్కిటిక్ ప్రాంతాలను పర్యవేక్షణ చేసిన ఒక భూప్రదక్షకుడు, గ్రీన్లాండు ప్రాంతంలోని ఈ వివాహ విధానాన్ని గురించి విపులంగా వ్రాసాడు. ఆ దేశంలో అనాగరిక జాతుల్లో కన్యకను జుట్టుపట్టి లాక్కోరావటం తప్ప ఇతరమైన వైవాహికవిధానమే లేదట. ఈ వివాహాన్ని కన్యక తల్లిదండ్రులైనా చూస్తూ ఉండవలసిందేగానీ ప్రతిగా ఏమీ చేయటానికి వీలు లేదు. పైగా అది కేవలము వ్యక్తిగతమైనదిగా భావిస్తారుట. ఎస్కిమో జాతిలో ఈ విధంగా బలాత్కృతి ఔతున్న కన్యక పోరాడుతుందిట. ఇది కేవలమూ ఆమె పవిత్ర నీతి నియమాల్ని (Modesty) నిరూపించటానికి చేసే ప్రతిఘటన మాత్రమే. జీవనము ఆ బలాత్కరించే వ్యక్తితోనే ఉన్నదని ఆమెకు తెలుసును. ఇది పరంపరాగతంగా వస్తూ ఉన్న ఆచారం గనుక, ఆమె అనుసరిస్తున్నది. అంతే. వేరొక జాతిలో రాక్షస వివాహలక్షణం చిత్రమైన స్థితిలో కనిపిస్తున్నదని ఫీల్డింగ్ 'వైవాహిక విచిత్రాచారాలు' అనే వ్యాసంలో నిరూపించాడు. కన్యక తండ్రి ఆమెకు యుక్తవయస్సు రాగానే అతడు ఆమెను పెళ్ళాడదలచుకున్న యువకునితో 'నీవు నా కుమార్తెను బలాత్కరించవచ్చును' అని చెపుతాడు. అతనిని ప్రతిఘటించకుండా లొంగిపోవడం కేవలం స్త్రీ జాతికి అపకారం. 'నీ శక్తిని ఉపయోగించి పెనగులాడాలి సుమా!' అని తల్లి కుమార్తెకు నీతి గరపుతుంది. కన్యక ఒంటరిగా నిద్రిస్తూ ఉన్నప్పుడు ఎన్నడూ బలాత్కరించటానికి పూనుకోడు. అది అతని ఉజ్జీవనానికి శుభోదర్కమైన క్రియ గాదని అతని నమ్మకం. వరుడు బలాత్కరించటానికి తలపడి వస్తున్నాడని తెలుసుకొని, కన్యక వస్త్రాలంకరణంతో, ఇది ఒక విధమైన యుద్ధానికి ఆయత్తం చేసుకొని పారిపోతుంటుంది. వరుడు మిత్ర బృందంతో వెంటబడి ఆమెను అడ్డగిస్తాడు. కొంతకాలం వారి ఇద్దరిమధ్యా చిన్న యుద్ధం జరుగుతుంది. కొంతసేపు పోరాడి ఆమె ఓడిపోతుంది; వివాహానికి అంగీకరిస్తుంది. ఇది ఒక బహిః ప్రదేశంలో జరుగుతుంది. ఇద్దరూ వాహనంమీద గ్రామంలోకి తిరిగి వస్తారు. పెద్దలు వారికి వివాహం చేస్తారు.
సంస్కృతి
263