చేసుకుంటున్నాను అని నిరూపించటానికి, కులంవారి ఎదుట వరుడు దూషణచేస్తాడు. ఈ జాతిలో రాక్షస వివాహ విధానమూ, దానికి అంగముగా, ఉన్న దూషణమూ చిత్రాతిచిత్రంగా కనిపిస్తున్నది. పరకులాల మీద ఇద్దరు ముగ్గురు మిత్రులు కలిసి దూషణయాత్రకు (Rape raid) బయలుదేరటం సర్వసామాన్యం. నిశ్శబ్దంగా వారి గుడిసెల్లో ప్రవేశించి ముళ్ళపొదను పోలిన బల్లెపు కొనకు స్త్రీల జుట్టును ఒకడు పెనవేస్తాడు. రెండవ వాడు బల్లెపు కొన వక్షఃప్రదేశానికి ఎదురుగా నిల్పి భయపెట్టి నిలుస్తాడు. నిద్ర మేల్కొన్న తరువాత ఆ స్త్రీ కిక్కురు మిక్కురు మనకుండా వారు చెప్పిన చోటికి నడిచి వెళ్ళుతుంది. ఆమెను ఒక చెట్టుకి కట్టివేసి 'నీవు నా బానిస' వని ఆమెకూ, 'ఈమె మా బానిస' అని ఇతర కులానికి తెలియజెప్పి, తరువాత వారిలో ఒకరు వివాహ మాడతారు. సర్వసామాన్యంగా ఆ జాతుల్లో ఉన్న వైవాహిక విధానమే ఇది కనుక, బందీకృతలైన స్త్రీలు ప్రతిఘటించటానికి ప్రయత్నించరు. ఆ జాతుల్లో చిన్నతనం నుంచి పిల్లలు ఇటువంటి దూషణక్రియకు అలవాటు పడే ఆటలు ఆడుకోవటం ఆ జాతులవారు నేర్పుతారట!
ఆస్ట్రేలియా జాతుల్లో అందమైన ఆడపిల్ల జీవితం అతి గహనంగా ఉంటుంది. ఒక భర్తతో ఆమెకు సుస్థిరమైన కాపురమంటూ ఏర్పడబోయే లోపల, ఒకదాని వెంట ఒకటిగా అంటి వచ్చే ఎన్నో దూషణక్రియలకు ఆమె గురౌతూ ఉంటుంది. అందువల్ల ఆమె శరీరము చెడిపోటమూ, ఆమె చివరకు చేరే నూతన సంఘంలో చికిత్స దొరకకపోవటమూ నిశ్చయము. ఇటువంటి అవస్థలకు పాలైన స్త్రీ కులంవారు ఆమె పొందుతున్న కష్టాలకు ప్రతిక్రియగా మరికొన్ని యుద్ధాలు చేయటమూ, అందువల్ల మరికొంత మంది జనాన్ని కోల్పోవటమూ జరుగుతుంది. అందుమూలంగా కొన్ని జాతులవారు అందమైన ఆడబిడ్డలను పెరిగి పెద్దవాళ్ళు కాగానే దేవతలకు బలియిస్తుంటారు. ఒకవేళ అటువంటి యుద్ధాలలో వారు గెలిచినా దోషిని ఒప్పజెప్పిన తరువాత, పది బల్లాలు అతనికి తగిలీ తగలనట్లుగా విసిరి చివరకు సంధి చేసుకొని, విందు కుడుస్తారు. న్యూ గినీలలోని పాపను జాతిలోనూ, ఫిజీ ద్వీపవాసుల్లోనూ, ఇటువంటి ఆచారం నేటికీ కనిపిస్తున్నది. నిజమైన దూషణముగానీ, కల్పితమైన దూషణము (Stimulated Rape) గానీ, వీళ్ళల్లో సర్వసామాన్యము. దీనికి ఆ జాతులవారూ అధిదేవతనుగా ఒక శక్తిని కొలుస్తారు. దూషిత ఐన స్త్రీ అతని సెజ్జ చేరటముగానీ, మృతి పొందటము గానీ జరుగుతుంది. చివరకు ఉభయజాతుల వారూ చేరి విందు చేసుకుంటారు. బ్రతికి ఉంటే ఈ విందుతో వివాహం పూర్తి ఐనట్లు.
సంస్కృతి
261