Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బలాత్కరించి తెచ్చుకోటం క్షేమకరమైనదని నేటికీ ఒక నమ్మకం. 'నవ్వే పెళ్ళికూతురు ఏడ్చే భార్య ఔతుందనీ, ఏడ్చే పెళ్ళికూతురు నవ్వే భార్య ఔతుందనీ' వారి సామెత. సైబీరియాలో కులం పెద్దలే వివాహాన్ని నిర్ణయించినా వరుడు వధువును బలాత్కరించి లాక్కో రావటం వైవాహికాచారం.

స్పెన్సర్ అనే రచయిత మొట్టమొదట 'కన్యకను ఇలా బలాత్కరించి తీసుకురావటానికి ఆమె అంగీకరించకపోవటం కారణమై ఉంటుంది' అన్నాడు. కొన్ని జాతుల్లో వివాహం కాని స్త్రీ పురుష జాతులకు రెంటికీ వైవాహిక సంబంధమైన యుద్ధాలు జరుగుతుంటవి. వాటిలో స్త్రీ జాతి బహుతీవ్రంగా ప్రతిఘటిస్తుంటారు. దీనికి మానసిక శాస్త్రవేత్తలూ, సాంఘిక శాస్త్రవేత్తలూ నిత్యవైరము (Sex - antagonism) మూలకారణమన్నారు. నేడు కూడా అనేక అనాగరిక జాతుల వివాహ సందర్భాలలో ఇటువంటి యుద్ధాలకు ప్రత్యామ్నాయంగా జరిగే ఉట్టుట్టి పోరాటాలు కనిపిస్తున్నవి. అరబ్బు జాతుల్లో పెళ్ళికొడుకు పక్షంలోని ఆడవాళ్ళు పెళ్ళికుమార్తె ఇంటిమీదికి దోపిడికి వెళ్ళి వాళ్ళ పురుషులతో పోరాడతారట!

భారతదేశంలో రాక్షసవివాహాన్ని మనువు ఒకానొక వైవాహిక విధానంగా అంగీకరించాడు. ఇది కేవలం క్షత్రియజాతికి మాత్రమే చెల్లుతుంది. ఒరిస్సాలోని భుయలాజాతిలో యువకుడు ఒక కన్యకను ప్రేమించినప్పుడు, ఆమె అంగీకరించకపోయినా, ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోయినా, ఏకాంతంగా కనిపించినప్పుడు ఎత్తుకోవచ్చుకుంటాడు. చిట్టగాంగ్ కొండ జాతుల్లోనూ ఆడపిల్లలు తక్కువ. వారు కూడా పరదేశం మీద పడి కన్యకలను తెచ్చుకుంటారు. వంగదేశంలో క్లాహౌ జాతి యువకుడు సంతోషంతో నృత్యం చేసే కన్యకను ఒంటరిగా చూచి తెచ్చుకొని భార్యనుగా చేసుకుంటాడు.

రాక్షస వివాహానికి దూషణము ప్రధాన లక్షణంగా అనేక జాతుల్లో కనిపిస్తున్నది. దూషణ మూలంగా భార్యలను సంపాదించుకోవటం పూర్వ రోమనుల లక్షణం. దీనికి సంబంధించిన అనేక కథలు బైబిలులో (Judges XX-XXI, Numbers XXXI, 7-8, Dueteronomy XXI) కనిపిస్తున్నవి. ఆస్ట్రేలియా జాతుల్లో భార్యను పొందే విషయంలో బలాత్కారమూ, దూషణమూ విశేషంగా ద్యోతకమౌతున్నది. ఇతర జాతిలోని స్త్రీని పొందదలచుకున్నప్పుడు వారి గుంపుమీద కాపలా వేసి, ఒంటరిగా కనిపించిన స్త్రీని ఆయుధంతో ఒక దెబ్బకొట్టి, చెట్టుపొదల మాటుకు తీసుకోవెళ్ళి, స్మృతి వచ్చిన తరువాత వారి గురువు దగ్గరకు తీసుకోవెళ్ళి బహిరంగంగా నేను ఈమెను వివాహం


260

వావిలాల సోమయాజులు సాహిత్యం-4